News March 3, 2025
అచ్చెన్న ‘గాలి’ వ్యాఖ్యలు.. బొత్స కౌంటర్

AP: మండలి ప్రతిపక్షనేత బొత్సను ఉద్దేశిస్తూ గాలికి వచ్చారంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడంతో దుమారం చెలరేగింది. దీనిపై మాజీ మంత్రి కౌంటరిచ్చారు. ‘నేను గాలికి వచ్చానంటూ మాట్లాడారు. నేను 1999లో తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టా. 42మందికిగాను INC నుంచి గెలిచిన ఐదుగురిలో నేనొకడిని. టీడీపీ హవాలోనూ నా భార్య ZP ఛైర్మన్ అయ్యారు. ఈ విషయం తెలిసినా కించపరిచేలా మాట్లాడటం సబబు కాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
కడప రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?

కడప రిమ్స్లో అందే సేవల విషయంలో పేషెంట్లు, వారి వెంట వెళ్లే కుటుంబసభ్యులు నిరుత్సాహం చెందుతున్నట్లు సమాచారం. ఇటీవల స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని కుటుంబీకులు చేతుల మీద ఎత్తుకెళ్లారు. అలాగే పేషెంట్లను తీసుకెళ్లాల్సిన స్ట్రెచర్లను చెత్తను తరలించడానికి సిబ్బంది ఉపయోగించిన ఫొటోలు కూడా బయటికి రావడంతో విమర్శలు వస్తున్నాయి. అక్కడి సేవలు, మీరు ఎదుర్కొన్న సమస్యలను కామెంట్ చేయండి.
News December 3, 2025
ఇండిగోలో సిబ్బంది కొరత.. పలు ఫ్లైట్లు ఆలస్యం, రద్దు

సిబ్బంది కొరతతో పలు ఇండిగో విమాన సర్వీసులు లేట్గా నడుస్తుండగా, కొన్ని రద్దవుతున్నాయి. మంగళవారం 35% ఫ్లైట్లు మాత్రమే సమయానికి నడిచినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన 200 సర్వీసులు రద్దయ్యాయి. నవంబర్లో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇండిగోలో పైలట్లు, ఫ్లైట్ సిబ్బంది కొరత ఎదుర్కొంటోంది.
News December 3, 2025
రూ.3.30 నుంచి రూ.90 వరకు.. రూపాయి పతనం ఇలా!

స్వాతంత్య్రం(1947) వచ్చేనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.3.30 ఉండేది. 30 సంవత్సరాల తర్వాత..
☛ 1977లో అది రూ.8.434కు చేరింది
☛ తరువాతి 30 ఏళ్ల(2007)కు 43.595గా ఉంది
☛ 2020లో రూ.73.23, 2021లో రూ.74.56, 2022లో రూ.82.76, 2023లో 83.4
☛ 2024లో 83.28కు బలహీనపడింది
☛ తాజాగా 2025 డిసెంబర్ నాటికి 90 రూపాయలకు పతనమైంది.


