News August 14, 2025
Op సిందూర్‌లో పాల్గొన్న 36 ఎయిర్ వారియర్స్‌కు గ్యాలంట్రీ అవార్డులు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న 36 ఎయిర్ వారియర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ అవార్డులు ప్రకటించింది. ఇందులో 9 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లకు వీర్ చక్ర మెడల్స్, 26 మందికి వాయుసేన మెడల్స్, ఒకరికి శౌర్య చక్ర పతకాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ జరిపిన దాడుల్లో వీరు కీలక పాత్ర పోషించారు.
Similar News
News August 14, 2025
3 దశాబ్దాల తర్వాత నచ్చినవారికి ఓటేశారు: పవన్

AP: మూడు దశాబ్దాల తర్వాత పులివెందులలో ఓటర్లు తమకు నచ్చిన వారికి ఓటేశారని Dy.CM పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల్లో గెలిచినవారికి అభినందనలు తెలిపారు. ‘గతంలో అక్కడ నామినేషన్లు కూడా వేయనీయలేదు. వేద్దామనుకున్నవారిపై దాడులకు తెగబడ్డారు. ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి’ అని పేర్కొన్నారు.
News August 14, 2025
ALERT: కాసేపట్లో వర్షం

TG: మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 1-2 గంటల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వాన పడుతుందని అంచనా వేసింది. అలాగే రాబోయే 2 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News August 14, 2025
ఈ నెల 18న శ్రీవారి ఆర్జిత టికెట్ల కోటా రిలీజ్

AP: నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న ఉ.10గంటలకు విడుదల చేయనున్నట్లు TTD తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు ఈ నెల 21న ఉ.10గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 23న ఉ.10గంటలకు అంగప్రదక్షిణ, 11గంటలకు శ్రీవాణి ట్రస్టు టోకెన్ల కోటా, 25న ఉ.10గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.