News April 19, 2024
Gallery: ఓటెత్తిన ప్రముఖులు

దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. వేసవి కావడంతో ఉదయాన్నే ఓటింగ్ సెంటర్లకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయాచోట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Similar News
News October 29, 2025
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా?

మన ఇంట్లో వస్తువుల అమరిక మనపై శుభాశుభ ఫలితాలను చూపుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ప్రతికూల శక్తి రాకుండా ఉండాలంటే.. వాడని, తుప్పు పట్టిన, ఆగిపోయిన గడియారం వంటి వస్తువులను వెంటనే తీసివేయాలని అంటున్నారు. ‘కిటికీలు, తలుపులపై సెలనైట్ రాళ్లు ఉంచడం శుభం. గ్యాస్ స్టవ్ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. లేదంటే ఆర్థిక సమస్యలు రావొచ్చు. రోజూ అగరబత్తి వెలిగిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది’ అంటున్నారు.
News October 29, 2025
పంట దిగుబడిని పెంచే పచ్చి ఆకు ఎరువు అంటే ఏమిటి?

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు.
News October 29, 2025
EPFO వేతన పరిమితి త్వరలో రూ.25వేలకు పెంపు?

EPFO వేతన పరిమితిని నెలకు ₹15,000 నుంచి ₹25,000కు పెంచే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం బేసిక్ పే గరిష్ఠంగా ₹15వేల వరకు ఉన్న ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు మాత్రమే దీని పరిధిలోకి వస్తున్నారు. వారికి EPF, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) అమలవుతున్నాయి. ఇప్పుడు ఈ పరిమితిని ₹25వేలకు పెంచే విషయంపై త్వరలో జరిగే EPFO సెంట్రల్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.


