News April 19, 2024
Gallery: మేం ఓటేశాం

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చెన్నైలో తమిళ స్టార్ హీరోలు విజయ్, సూర్య సాధారణ ప్రజలతోపాటు క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ‘మేం ఓటేశాం.. మీరూ ఓటు వేయండి’ అంటూ పిలుపునిచ్చారు.
Similar News
News February 3, 2026
NABARDలో 162 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

NABARDలో 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో APలో 8 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 21 -35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరి 21న, మెయిన్ ఎగ్జామ్ ఏప్రిల్ 12న నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు https://www.nabard.org చూడండి.
News February 3, 2026
AIIMS బిలాస్‌పుర్‌లో 52 పోస్టులు

AIIMS బిలాస్‌పుర్ 52 సీనియర్ రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు FEB 4న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS/DNB, MSc/M. Biotech, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. మెడికల్ అభ్యర్థులకు నెలకు రూ.67,700+NPA, నాన్ మెడికల్ అభ్యర్థులకు రూ.56,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsbilaspur.edu.in
News February 3, 2026
పిల్లలకు స్నానం ఎలా చేయించాలంటే?

బిడ్డకి స్నానం చేయించే నీరు ఎక్కువగా వేడిగా, చల్లగా అసలే ఉండకూడదు. గోరువెచ్చగా ఉంచాలి. ఎక్కువగా రుద్దడం, రాయడం వంటివి చేయొద్దు. నెలలు గడిచేకొద్దీ చేయొచ్చు ఇవన్నీ. కానీ, మొదట్లోనే మసాజ్ చేయడం, ముక్కు పొడవుగా వస్తుందని లాగడం వంటివి చేయొద్దు. దీంతో వారికి గాయాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తల, మెడకింద చేయి సపోర్ట్ ఉంచండి. వీలైతే వేరొకరి సాయం తీసుకోండి.


