News January 10, 2025
విరాట్, రోహిత్‌ను గంభీర్ తప్పించలేరు: మనోజ్ తివారీ
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను భారత జట్టు నుంచి తప్పించే సాహసం కోచ్ గంభీర్ చేయరని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. ఆఖరి టెస్టుకు రోహిత్ స్వచ్ఛందంగా పక్కన కూర్చుని ఉండి ఉంటారని తెలిపారు. ‘గంభీరే రోహిత్‌ను పక్కకు పెట్టారన్న వార్తలు కరెక్ట్ కాదనుకుంటున్నా. అయితే, జట్టు కోసమే చేసినా ఓ కెప్టెన్‌గా రోహిత్ అలా తప్పుకుని ఉండాల్సింది కాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 11, 2025
జనవరి 11: చరిత్రలో ఈరోజు
* 1922: మధుమేహ బాధితులకు ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చిన రోజు
* 1944: జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సోరెన్ జననం
* 1966: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం(ఫొటోలో)
* 1973: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు
* 2008: పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం
News January 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 11, 2025
హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఊరట
డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ కేసులో ఊరట లభించింది. ఆయన దోషిగా తేలినప్పటికీ అన్‌కండీషనల్ డిశ్చార్జ్ ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దేశ ప్రజలు ఆయన్ను నమ్మి అధ్యక్షుడిగా గెలిపించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. అధ్యక్షుడికి అందించే రక్షణ ప్రయోజనాలను ఇస్తూ జైలు శిక్ష లేదా జరిమానా గానీ విధించడం లేదని న్యాయమూర్తి అన్నారు. కాగా.. నేర నిరూపణ అయిన తొలి అధ్యక్షుడిగా ట్రంప్ ఆ దేశ చరిత్రలో నిలిచిపోనున్నారు.