News August 4, 2024
గంభీర్ ఎక్కువ కాలం కోచ్గా ఉండలేడు: జోగిందర్

ముక్కుసూటిగా ఉండే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్గా ఎక్కువ కాలం ఉండలేడని మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ అన్నారు. తనకు అతడిపై వ్యక్తిగత ద్వేషమేమీ లేదని చెప్పారు. ‘గౌతీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఏ పనైనా నిజాయితీగా చేస్తాడు. కానీ అలాంటి వ్యక్తికి ఒక్కోసారి ఆటగాళ్లతో విభేదాలు రావచ్చు. ఆ సమయంలో నిర్మొహమాటంగా మాట్లాడేస్తాడు. ఇలా చేస్తే ఎక్కువకాలం కోచ్గా ఉండలేడు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
BRIC-THSTIలో ఉద్యోగాలు

BRIC-ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్& టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (<
News November 17, 2025
పెద్దపల్లి: కారు ఢీకొని ఒకరు మృతి

పెద్దపల్లి పట్టణ పరిధి బంధంపల్లిలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బంధంపల్లి వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఓ కారు ఢీ కొట్టింది. దీంతో బైకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 17, 2025
షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాను ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్(ICT) దోషిగా తేల్చింది. గతేడాది విద్యార్థుల ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారని, 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన ICT ఆధారాలను నిజమైనవిగా పరిగణించి దోషిగా తేల్చింది. ఆమెకు గరిష్ఠశిక్ష పడుతుందని పేర్కొంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తీర్పును పట్టించుకోనని హసీనా అన్నారు.


