News November 23, 2024
గంభీర్ నాకు ఇచ్చిన సలహా అదే: హర్షిత్ రాణా

తన టెస్టు కెరీర్‌కు మంచి ఆరంభం లభించడం వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన సలహాలున్నాయని భారత పేసర్ హర్షిత్ రాణా తెలిపారు. ఆయన తనకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ‘ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తి గంభీర్. ఓపికతో ఉండాలన్నదే ఆయన నాకు ఇచ్చిన సలహా. దేశానికి ఆడే అవకాశం వచ్చాక భారత ప్రజల్ని గుర్తుపెట్టుకుని సర్వశక్తులూ ఒడ్డి ఆడాలని సూచించారు. అదే చేస్తున్నా’ అని తెలిపారు.
Similar News
News November 7, 2025
HDFC బ్యాంక్ యూజర్లకు BIG ALERT

ఈ రాత్రి 2.30 గంటల(8వ తేదీ) నుంచి ఉ.6.30 గంటల వరకు తమ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవని HDFC ప్రకటించింది. మెయింటెనెన్స్‌లో భాగంగా UPI, నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. ఈమేరకు ఖాతాదారులకు మెసేజ్‌లు పంపుతోంది. ఆ సమయంలో ట్రాన్సాక్షన్స్ కోసం PayZapp వ్యాలెట్ వాడాలని సూచించింది. మరి మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?
News November 7, 2025
సిరీస్‌పై భారత్ కన్ను!

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో 2-1తో లీడ్‌లో ఉన్న భారత్ రేపు జరిగే చివరి(5వ) మ్యాచులోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోగా ఇదైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అయితే మ్యాచ్ జరిగే గబ్బా(బ్రిస్బేన్) గ్రౌండ్లో ఆసీస్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2006 నుంచి ఇక్కడ ఆ జట్టు 8 టీ20లు ఆడగా కేవలం ఒక్కదాంట్లోనే ఓడింది. దీంతో ఆసీస్‌ను ఇండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
News November 7, 2025
MP అకౌంట్ నుంచి ₹56 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు

TMC MP కళ్యాణ్ బెనర్జీ బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు ₹56L మాయం చేశారు. బెనర్జీ MLAగా ఉన్నప్పుడు కోల్‌కతాలోని SBI హైకోర్టు బ్రాంచిలో తీసిన అకౌంట్ చాలాకాలంగా ఇనాక్టివ్‌గా ఉంది. ఇటీవల నేరగాళ్లు మార్ఫ్డ్ పత్రాలు, ఫొటోలతో KYCలో ఫోన్ నంబర్ మార్చి డబ్బు మాయం చేశారు. MP ఫిర్యాదుతో అధికారులు కేసు పెట్టారు. ‘బ్యాంకులో ఉంచితే క్రిమినల్స్, ఇంట్లో ఉంచితే మోదీ తీసుకుంటారు’ అని బెనర్జీ విమర్శించారు.


