News June 22, 2024
గంభీర్ గొప్ప ఫైటర్: అశ్విన్

కెరీర్ ఆరంభంలో తనలో ఆత్మవిశ్వాసం పెంచడంలో గంభీర్ కీలక పాత్ర పోషించారని స్పిన్నర్ అశ్విన్ తెలిపారు. ఆటపై అతనికి ఉన్న అవగాహన అత్యుత్తమమైనదని కొనియాడారు. ‘గౌతమ్ గొప్ప ఫైటర్. జట్టు విజయం కోసం ఎల్లప్పుడూ కష్టపడే వ్యక్తి. కానీ అతని ప్రవర్తనను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అతనిపై నాకు అపారమైన గౌరవం ఉంది’ అని చెప్పారు. కాగా భారత జట్టు కోచ్‌గా గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లు సమాచారం.
Similar News
News November 23, 2025
కుజ దోషం తొలగిపోవాలంటే?

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.
News November 23, 2025
కేజీ రూపాయి.. డజను రూ.60!

AP: మూడేళ్లుగా టన్ను <<18336571>>అరటి<<>> రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ ఉంది? COMMENT.
News November 23, 2025
కుజ దోష నివారణకు చేయాల్సిన పూజలు

కుజ దోషానికి అంగారకుడు కారణం. ఆయనను పూజిస్తే ఈ దోషం పోతుందని నమ్మకం. ఉజ్జయినీలో శివుడి చెమట నుంచి పుట్టిన అంగారకుడి మంగళనాథ్ ఆలయం ఉంది. ఇక్కడ కుజ దోష నివారణకు పూజలు చేస్తారు. APలో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయాల్లో నిర్వహించే శాంతి పూజలు కుజ దోష నివారణకు ప్రసిద్ధి. మంగళవారం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఈ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.


