News October 5, 2024
గంభీర్ నా సోదరుడి లాంటివాడు: అక్మల్

టీమ్ ఇండియా కోచ్ గంభీర్, పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తరచూ గొడవ పడేవారన్న సంగతి తెలిసిందే. 2010లో ఆసియా కప్ సందర్భంగా ఒకరినొకరు సవాలు చేసుకోగా అంపైర్లు జోక్యం చేసుకుని విడిపించారు. అయితే అదంతా గ్రౌండ్ వరకేనని అక్మల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమ ఇద్దరికీ వివాదాలేవీ లేవని, ఆయన తనకు సోదరుడితో సమానమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరం మంచి స్నేహితులమని వివరించారు.
Similar News
News January 24, 2026
600 అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు స్థానిక భాషపై పట్టున్న వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bankofmaharashtra.bank.in/careers
News January 24, 2026
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

AP: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు 2 సెషన్లలో (9.00 AM-12.00PM, 2.00PM-5.00PM) ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్/ ఆధార్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. <
News January 24, 2026
కిషన్ రెడ్డి నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నా: భట్టి

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిపై ఎంక్వైరీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నట్లు Dy.CM భట్టి అన్నారు. ‘105ఏళ్లుగా సింగరేణి కొనసాగుతోంది. ఆ సంస్థ నిర్ణయాలు మంత్రి వద్దకు రావు. కోల్ ఇండియా 2018లో టెండర్ డాక్యుమెంట్ పంపింది. సైట్ విజిట్ తప్పనిసరి అని CMPDI డాక్యుమెంట్లో ఉంది. ఆ సమయంలో మా ప్రభుత్వం లేదు. 2021, 2023లో కోల్ ఇండియా, NMDC పంపిన డాక్యుమెంట్లలోనూ సైట్ విజిట్ అని ఉంది’ అని స్పష్టం చేశారు.


