News August 2, 2024
గంభీర్ మార్క్.. గిల్ కూడా బౌలింగ్ వేశాడుగా!

కోచ్ గౌతమ్ గంభీర్ రాకతో టీమ్ ఇండియాలో కొత్త మార్పులు జరుగుతున్నాయి. SLతో తొలి వన్డేలో గిల్‌తో బౌలింగ్ వేయించారు. ఒక ఓవర్ వేసి 14 రన్స్ ఇచ్చారు. అంతకుముందు SLతో టీ20ల్లో రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. జట్టులో ఉన్న 10 మంది (కీపర్ మినహా) కచ్చితంగా బ్యాటింగ్, బౌలింగ్ నేర్చుకోవాల్సిందే అని గౌతీ రూల్ పెట్టినట్లు ఉన్నారని నెటిజన్లు సరదా పోస్టులు పెడుతున్నారు.
Similar News
News March 26, 2026
ఇరాన్ దెబ్బ.. హోటళ్లకు మారిన అమెరికన్ దళాలు

గల్ఫ్ రీజియన్‌లోని తమ స్థావరాలపై ఇరాన్ దాడులతో US దళాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సైనికులంతా వాటిని ఖాళీ చేసి హోటళ్లు, ఆఫీసులకు మారినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. దీన్నిబట్టి ట్రంప్ సన్నాహాలు లేకుండానే యుద్ధంలోకి దిగినట్లు అర్థమవుతోందని ఓ అధికారి పేర్కొన్నట్లు తెలిపింది. మరోవైపు US జవాన్ల ఆచూకీ తెలపాలంటూ ప్రజలను IRGC కోరుతోంది. వాళ్లు పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆరోపిస్తోంది.
News March 26, 2026
చిరు, నాగబాబును అన్నయ్య అనే పిలుస్తా: అన్నా కొణిదెల

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనకు అన్నదమ్ములు లేరని, కానీ పెళ్లై కొణిదెల ఫ్యామిలీలోకి వచ్చాక చిరంజీవిని ‘అన్నయ్య’ అని, నాగబాబును ‘చిన్న అన్నయ్య’ అని పిలవడం భర్త నుంచి అలవాటైందని పేర్కొన్నారు. వరుసల పరంగా పిలుపులు వేరైనా.. మనసుతో వారిని తన సొంత సోదరులుగానే భావిస్తున్నానని ఆమె రాసుకొచ్చారు. మెగా బ్రదర్స్‌పై ఆమె చూపిన ఈ అనురాగం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
News March 26, 2026
మధ్యాహ్న భోజనంలో చేపలు: మంత్రి వాకిటి

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా తిలాపియా రకం చేపలను పెంచుతామని తెలిపారు. రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.


