News January 2, 2025

ఇకపై తాను చెప్పినట్లు ఆడాల్సిందేనన్న గంభీర్?

image

ఎంసీజీలో భారత్ ఓటమి అనంతరం ఆటగాళ్లందరిపై గంభీర్ తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. స్పోర్ట్స్ తక్ కథనం ప్రకారం.. ‘6 నెలలుగా మీరు ఎలా ఆడితే అలా వదిలేశాను తప్ప ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. సైలెంట్‌గా ఉన్నది మీరు లోకువ తీసుకుంటారని కాదు. ఇక చాలు. ఇకపై నేను చెప్పినట్లుగానే గేమ్ ప్లాన్ ఉంటుంది. అది అమలుచేసేవాళ్లు మాత్రమే ఆడతారు. చేయలేని వారికి థాంక్యూ’ అని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.

Similar News

News December 3, 2025

ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

image

ప్రకాశం జిల్లాలోని వివిధ ఉన్నత, ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకై కాంట్రాక్టు పద్ధతిన అకడమిక్ ఇన్‌స్పెక్టర్స్‌ను నియమిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఒంగోలులోని డీఈఓ కార్యాలయం నుంచి ఆయన ప్రకటన విడుదల చేశారు. అర్హులైనవారు ఈనెల 5లోగా దరఖాస్తులను మీ పరిధిలోని MEOలకు అందజేయాలన్నారు. వివరాలకు స్థానిక MEOలను సంప్రదించాలన్నారు.

News December 3, 2025

చెలరేగిన బ్యాటర్లు.. భారత్ భారీ స్కోర్

image

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ 358/5 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్(14), జైస్వాల్(22) నిరాశపరచగా.. రుతురాజ్(105) వన్డేల్లో తొలి సెంచరీ బాదారు. కోహ్లీ(102) వరుసగా రెండో వన్డేలోనూ శతకం నమోదు చేశారు. రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, వరుసగా రెండో అర్ధసెంచరీ(66*) చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్ 2, బర్గర్, ఎంగిడి తలో వికెట్ తీశారు.

News December 3, 2025

రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి

image

TG: హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. CM రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం రేవంత్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు.