News September 14, 2024
నైపుణ్యం ఉన్నవారికి గంభీర్ మద్దతు ఉంటుంది: పీయూష్

టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌పై స్పిన్నర్ పీయూష్ చావ్లా ప్రశంసలు కురిపించారు. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు ఆయన మద్దతుగా నిలుస్తారని తెలిపారు. ‘ఆయన ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతారు. స్వేచ్ఛగా ఆడమని చెబుతారు. మీలో టాలెంట్ ఉందని అనిపిస్తే మీరు ప్రదర్శన చేయకపోయినా అండగా నిలిచి అవకాశాలిస్తారు. ఏ ఆటగాడికైనా అదే కావాలి. గ్రౌండ్‌లో దూకుడుగా ఉండే గౌతీ వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడు’ అని వెల్లడించారు.
Similar News
News December 14, 2025
ఆరేళ్ల ప్రేమ.. ఇద్దరు పిల్లలు.. త్వరలో పెళ్లి

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ కూడా అయిందని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2019లో మెహర్ జెసియాతో విడాకుల తర్వాత గాబ్రియెల్లాతో అర్జున్ ప్రేమ బంధం కొనసాగుతోంది. పెళ్లికి ముందే వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాబ్రియెల్లా తెలుగులో ‘ఊపిరి’ సినిమాలో, అర్జున్ ‘భగవంత్ కేసరి’లో మెప్పించారు.
News December 14, 2025
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన బిహార్ మంత్రిగా ఉన్నారు. అటు UP BJP అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి స్థానంలో పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఈయన 7 సార్లు ఎంపీగా గెలిచారు.
News December 14, 2025
వరించిన అదృష్టం.. డ్రాలో సర్పంచ్ పదవి

TG: మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్‌గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించారు. మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. సునీత (కాంగ్రెస్), బీమిలి(బీఆర్ఎస్) ఇద్దరికి 182 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి, ఒకటి NOTAకు పడింది. ఇద్దరికీ సమానంగా రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి కేతావత్ సునీతను విజయం వరించింది.


