News October 11, 2024

నితీశ్‌కుమార్ రెడ్డికి గంభీర్ గోల్డెన్ అడ్వైస్

image

కోచ్ గౌతమ్ గంభీర్ సలహా తన కాన్ఫిడెన్స్‌ను పెంచిందని టీమ్ఇండియా యంగ్ సెన్సేషన్ నితీశ్‌కుమార్ రెడ్డి (NKR) అన్నారు. బంగ్లాతో రెండో టీ20లో మెరుగైన ప్రదర్శనకు అదే కారణమని చెప్పారు. ‘నిజం చెప్పాలంటే నేను గౌతమ్ సర్‌కు థాంక్స్ చెప్పాలి. బౌలింగ్ చేస్తున్నప్పుడు బౌలర్‌లా ఆలోచించాలని, బౌలింగ్ చేయగలిగే బ్యాటర్‌గా కాదని ప్రతిసారీ చెప్తుంటారు’ అని అన్నారు. మ్యాచులో NKR 74 (34balls), 2 వికెట్లు సాధించారు.

Similar News

News October 11, 2024

భార్య సూచన.. రూ.25 కోట్లు తెచ్చిపెట్టింది

image

మైసూరుకు చెందిన మెకానిక్ అల్తాఫ్‌కు ₹25 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతని కుటుంబం సంతోషంలో తేలిపోతోంది. అతను 15 ఏళ్లుగా కేరళ తిరుఓనమ్ బంపర్ లాటరీ కొంటున్నారు. ఈ ఏడాదీ ఫ్రెండ్ ద్వారా రెండు టికెట్లు(ఒక్కోటి ₹500) కొనుగోలు చేశారు. తర్వాత ఓ టికెట్‌ను స్నేహితునికి ఇవ్వాలనుకోగా భార్య అతడిని ఆపింది. అదే టికెట్‌కు అదృష్టం వరిస్తుందేమో అని చెప్పడంతో ఆగిపోయాడు. ఆ టికెట్‌కే ₹25 కోట్ల బహుమతి దక్కింది.

News October 11, 2024

రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది: నారా లోకేశ్

image

AP: రాష్ట్రంలో ఇప్పటికే రెడ్ బుక్ యాక్షన్ స్టార్ట్ చేశామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ బుక్‌లో పేర్లు ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ‘విజయవాడ వరదలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలోకి ఇండస్ట్రీలు రాకుండా అడ్డుకునే వారిని వదలం. వైసీపీ తరిమేసిన పరిశ్రమలను తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

News October 11, 2024

కొన్నిసార్లు హార్దిక్ పాండ్య… : SKY

image

బంగ్లా‌తో రెండో టీ20లో కుర్రాళ్ల ఆటతీరుతో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. ‘మా మిడిలార్డర్ బ్యాటర్లు ప్రెజర్లో ఆడాలని, తమను తాము ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలని కోరుకుంటా. రింకూ, నితీశ్, పరాగ్ మేం ఆశించినట్టే ఆడారు. వేర్వేరు సందర్భాల్లో బౌలర్లు భిన్నంగా ఎలా బౌలింగ్ చేస్తారో పరీక్షిస్తుంటాం. అందుకే కొన్నిసార్లు పాండ్య, సుందర్ బౌలింగ్ చేయరు’ అని అన్నారు.