News January 5, 2025
ప్లేయర్ల భవిష్యత్తుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు

రోహిత్, కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ కావాలని వస్తున్న డిమాండ్లపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లేయర్ల భవిష్యత్తుపై ఏమీ మాట్లాడను. వారిలో తపన, నిబద్ధత ఉంటే వారే భారత్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తారు. డ్రెస్సింగ్ రూమ్‌ను సంతోషంగా ఉంచడానికి నేను ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉంటాను. వంద టెస్టులు ఆడినా, ఒక్క మ్యాచూ ఆడకపోయినా ప్లేయర్లను సమానంగా చూస్తా’ అని గౌతీ చెప్పారు.
Similar News
News November 20, 2025
ములుగు: గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు

58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈనెల 14న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా పలు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అదేవిధంగా పలువురిని సన్మానించారు. గ్రంథాలయాలను మంత్రి సీతక్క చొరవతో అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.
News November 20, 2025
శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(TDB) మాజీ ప్రెసిడెంట్, CPM మాజీ ఎమ్మెల్యే పద్మా కుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆలయం నుంచి కొన్ని విగ్రహాల బంగారు తాపడం చోరీకి గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పద్మ కుమార్‌ను అధికారులు ఇవాళ ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో TDB మాజీ కమిషనర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.
News November 20, 2025
నటి మృతి.. అసలేం జరిగింది?

నటి ప్రత్యూష మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తాను నిర్దోషినని ఆమె ప్రియుడు సిద్ధార్థరెడ్డి.. నిందితుడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును SC రిజర్వ్ చేసింది. ఇంటర్లో ప్రేమించుకున్న ప్రత్యూష, సిద్ధార్థ్ 2002 FEB 23న విషం తాగారు. మరుసటి రోజు ప్రత్యూష మరణించగా సిద్ధార్థ్ కోలుకున్నాడు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేలా అతడే ఉసిగొల్పాడంటూ ప్రత్యూష తల్లి కోర్టుకెళ్లారు.


