News January 8, 2025

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ నిర్మాతలకు షాక్

image

AP: గేమ్ ఛేంజర్, <<15068245>>డాకు మహారాజ్<<>> సినిమాల టికెట్ రేట్ల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. 14 రోజుల వరకు <<15065900>>టికెట్ రేట్ల పెంపునకు<<>> ప్రభుత్వం అనుమతినివ్వగా, దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

Similar News

News November 17, 2025

సౌదీ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి

image

సౌదీలో జరిగిన ఘోరప్రమాదంలో 45 మంది HYD వాసులు మరణించడంపై AP CM CBN దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్ర యాత్రలో ఇలా జరగడం బాధాకరమన్నారు. ప్రమాదంపై BRS అధినేత KCR దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు సాయంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఏపీ మాజీ CM YS జగన్ విచారం వ్యక్తంచేస్తూ గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

News November 17, 2025

iBOMMA కేసు.. పోలీసులపై మీమ్స్ చేస్తే చర్యలు: సజ్జనార్

image

iBOMMA రవి గురించి మాజీ భార్య సమాచారం ఇచ్చిందన్న వార్తలను HYD CP సజ్జనార్ ఖండించారు. అతని గురించి తమకు ఎవరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని, పోలీసులే స్వతహాగా పట్టుకున్నారని స్పష్టం చేశారు. రవి అరెస్టు తర్వాత పోలీసులపై చాలా మంది మీమ్స్ చేశారని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రవి మహారాష్ట్ర, ఏపీ నుంచి ప్రహ్లాద్ కుమార్ పేరిట డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నాడు అని చెప్పారు.

News November 17, 2025

మీ తీరు కోర్టు ధిక్కారమే.. TG స్పీకర్‌పై SC ఆగ్రహం

image

TG: MLAల కేసులో స్పీకర్ తీరుపై SC ఆగ్రహించింది. ‘వారిపై నిర్ణయం తీసుకుంటారా? ధిక్కారం ఎదుర్కొంటారా? మీరే తేల్చుకోండి’ అని CJI గవాయ్ స్పష్టంచేశారు. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో స్పీకరే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన తీరు కోర్టు ధిక్కారమేనన్నారు. ఆ MLAలపై వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. గడువులోగా విచారణ పూర్తిచేస్తామని స్పీకర్ తరఫున రోహత్గీ, సింఘ్వీ తెలిపారు.