News December 30, 2024
విజయవాడ లేదా రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలను చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. ఇవాళ Dy.CM పవన్ను కలిసిన నిర్మాత దిల్ రాజు జనవరి 4 లేదా 5న జరిగే ఈవెంట్కు రావాలని ఆహ్వానించారు. పవన్ తన నిర్ణయం వెల్లడించగానే వేదికను యూనిట్ ఖరారు చేయనుంది. అటు పవన్తో భేటీలో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై దిల్ రాజు మాట్లాడారు.
Similar News
News November 25, 2025
ఆ కేసుతో మా నాయకులకు సంబంధం లేదు: YCP

పరకామణి చోరీ కేసుతో తమ పార్టీ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని YCP పేర్కొంది. ‘ఇవాళ విచారణకు రావాలని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమనకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసును పక్కదోవ పట్టించడానికే విచారణకు రావాలని హడావుడి చేశారు. వైసీపీ నాయకులకు సంబంధం లేకపోయినా ఈ కేసును మెడకు చుట్టి కూటమి నేతలు రాక్షసానందం పొందుతున్నారు. ఇంకెంతకాలం ఈ కక్ష సాధింపులు చంద్రబాబు?’ అని YCP ట్వీట్ చేసింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.
News November 25, 2025
ALERT.. వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

AP: మలక్కా జలసంధి ప్రాంతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడిందని APSDMA తెలిపింది. ఇది నెమ్మదిగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. తుఫాను ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయంది.


