News January 2, 2025

‘గేమ్ ఛేంజర్‌’కు తమిళంలో గట్టి పోటీ

image

కోలీవుడ్‌లో సంక్రాంతి బరి నుంచి అజిత్ సినిమా ‘విదాముయర్చి’ తప్పుకోవడంతో ‘గేమ్ ఛేంజర్’కు అక్కడ పోటీ లేదని రామ్ చరణ్ ఫ్యాన్స్ భావించారు. అయితే, కోలీవుడ్ స్టార్స్ సినిమాలు లేకపోవడంతో ఏకంగా ఆరు చిన్న సినిమాలు తమిళంలో సంక్రాంతికి వస్తుండటం గమనార్హం. వనంగన్, కాదలిక్కు నేరమిల్లై, టెన్ అవర్స్, పదవి తలైవన్, మద్రాస్ కారన్, తరుణం, సుమో తదితర సినిమాలు పండగ బరిలో గేమ్ ఛేంజర్‌కు పోటీగా రానున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 4, 2025

జగన్ గ్యాంగ్ రూ.వందల కోట్ల అక్రమాలు చేయించింది: టీడీపీ

image

AP: అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ గ్యాంగ్ ప్రభుత్వ అధికారులను బెదిరించి అక్రమాలు చేయించిందని టీడీపీ ఆరోపించింది. రూ.వందల కోట్ల ఆస్తులను దౌర్జన్యంగా రాయించుకుందని విమర్శించింది. ఆ గ్యాంగ్ ఇప్పటికీ ఓ అధికారిని బెదిరిస్తుండటంతో అతను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు లేఖ రాశారని ట్వీట్ చేసింది. ఈ స్కామ్‌లో జగన్ సోదరుడు సునీల్ రెడ్డి, పీఏ నాగేశ్వర్, భారతి బినామీ శ్రీకాంత్, నటి రీతూ చౌదరి ఉన్నారంది.

News January 4, 2025

రోహిత్ శర్మ.. ది లీడర్

image

ఫాంలో లేనని స్వయంగా జట్టు నుంచి తప్పుకున్న రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్లు, సినీ స్టార్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమ్ కోసం ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని, ఇది అతడి నిజాయితీ, నిస్వార్థాన్ని తెలియజేస్తోందని సురేశ్ రైనా ట్వీట్ చేశారు. తన కంటే దేశం, జట్టు గురించే ఎక్కువ ఆలోచించారని, రోహిత్ శర్మ నిర్ణయాన్ని గౌరవించాలని అజహరుద్దీన్ అన్నారు. రోహిత్ సూపర్ స్టార్ అని నటి విద్యాబాలన్ ట్వీట్ చేశారు.

News January 4, 2025

HMPV వైరస్‌పై TG ప్రభుత్వం కీలక ప్రకటన

image

చైనాలో విజృంభిస్తోన్న HMPV వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంది. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, ఇది సాధారణ జలుబు & ఫ్లూ లక్షణాలను కలిగి ఉంటుందని తెలిపింది. జలుబు ఉన్నవారు మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నీరు పుష్కలంగా తాగుతూ పౌష్టికాహారం తినాలి. ఎక్కువగా నిద్రపోవాలి. షేక్ హ్యాండ్స్ వద్దు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు’ అని తెలిపింది.