News August 5, 2024

‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ మరోసారి వాయిదా?

image

శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా DECలో రిలీజ్ అవుతుందని నిర్మాత ప్రకటించినా తాజాగా ఓ న్యూస్ వైరలవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ మూవీ రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికే ఏప్రిల్ 10న ‘రాజాసాబ్’, మార్చి 28న ‘VD12’ డేట్స్ లాక్ చేసుకోగా ‘గేమ్ ఛేంజర్’ అదే టైమ్‌కి వస్తే పోటీ ఆసక్తికరంగా మారనుంది.

Similar News

News March 11, 2026

60 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన సిలిండర్ ధర!

image

దేశంలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు 60 ఏళ్లలో భారీగా పెరిగాయి. 1960లో కేవలం ₹7 నుంచి ₹10 మధ్య ఉన్న ధర 2026 నాటికి ఢిల్లీలో ₹913కు చేరుకుంది. 1990లో ₹120, 2010లో ₹400గా ఉన్న ధర నేడు సామాన్యుడిపై పెను భారంగా మారింది. అంతర్జాతీయ ఇంధన ధరల మార్పులు, మారుతున్న సబ్సిడీ విధానాలు & ద్రవ్యోల్బణం కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన ఆరు దశాబ్దాలలో సిలిండర్ ధర దాదాపు వంద రెట్లు పెరగడం గమనార్హం.

News March 11, 2026

వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

image

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 11, 2026

యుద్ధం తిప్పలు.. ‘షార్ట్స్ వేసుకోండి, మెట్లు ఎక్కండి’

image

మిడిల్ ఈస్ట్ యుద్ధంతో విద్యుత్ ఆదా చేసేందుకు థాయిలాండ్ ప్రధాని అక్కడి ఉద్యోగులకు స్పెషల్ రూల్స్ ప్రవేశపెట్టారు. ఆఫీసుల్లో ఏసీలు 26-27 డిగ్రీల వద్దే మెయింటెన్ చేయాలని ఆదేశించారు. సూట్లు, టైలకు బదులు షార్ట్స్, షర్ట్స్ వేసుకోవాలని సూచించారు. ఎలివేటర్లకు బదులు మెట్లు ఉపయోగించాలని, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు. కాగా థాయిలాండ్‌లో 68% విద్యుత్ నేచురల్ గ్యాస్ నుంచే ఉత్పత్తి అవుతోంది.