News January 4, 2025

‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరలు భారీగా పెంపు

image

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు AP ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తొలిరోజు 6 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. JAN 10న అర్ధరాత్రి ఒంటిగంట షో(బెన్ఫిట్)కు టికెట్‌ రూ.600కు అమ్ముకోవచ్చని తెలిపింది. మిగతా 5 షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.175, సింగిల్ స్క్రీన్‌లపై రూ.135 హైక్ ఇచ్చింది. 23వ తేదీ వరకూ రోజుకు ఐదు షోలకు హైక్‌తో టికెట్స్ విక్రయించుకోవచ్చని చెప్పింది.

Similar News

News January 6, 2025

నమస్కారం ముద్దు.. హ్యాండ్ షేక్ వద్దు: IMA

image

చలితో ప్రబలే సీజనల్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని IMA హైదరాబాద్ విభాగం సూచించింది. ప్రస్తుతం నగరంలో శ్వాస సంబంధ కేసులు అదుపులోనే ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ పిల్లలు సహా అందరూ తప్పక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని IMA HYD అధ్యక్షుడు డా. ప్రభు సూచించారు. hMPV కేసుల నేపథ్యంలో ఇతరులను తాకడాన్ని మానుకోవాలన్నారు. అటు పలకరింపులో ‘నమస్కారం ముద్దు హ్యాండ్ షేక్ వద్దు’ను పాటించాలని సూచించారు.

News January 6, 2025

బౌన్సర్ల తీరుపై నటుడి అసహనం

image

బౌన్సర్ల తీరుపై నటుడు బ్రహ్మాజీ X వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ‘ఎక్కడ చూసినా బౌన్సర్స్. వాళ్ల ఓవరాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవట్లేదు. ఏం చేయాలి? బయట అయితే ఓకే. సెట్స్‌లో కూడానా’ అని రాసుకొచ్చారు. దీంతో ‘సెట్స్‌లో మిమ్మల్ని బౌన్సర్లు ఏమైనా అన్నారా?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏ మూవీ షూటింగ్‌లో జరిగిందో చెప్పాలని కోరుతున్నారు.

News January 6, 2025

ట్రెండింగ్‌లో #lockdown

image

దేశంలో hMPV కేసులు నమోదవుతుండటంతో ట్విటర్లో lockdown హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. లాక్‌డౌన్ పెట్టాలని, WFH అమలు చేయాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. ఇంకొందరు మీమ్స్ షేర్ చేస్తున్నారు. మరికొందరేమో బాధ్యతగా, మానవతా దృక్పథంతో నడుచుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ లాక్‌డౌన్లో ఎంతో మంది ఉపాధి, సన్నిహితులను కోల్పోయి చిత్రవధ అనుభవించారని గుర్తు చేస్తున్నారు. ఫార్మా మాఫియాను నిందిస్తున్నారు.