News January 11, 2025
‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వుల ఉపసంహరణ

TG: గేమ్ ఛేంజర్ మూవీకి ప్రభుత్వం మరో బిగ్ షాకిచ్చింది. టికెట్ ధరలను పెంచుకోవచ్చంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే తెల్లవారుజాము <<15130242>>స్పెషల్ షోలను రద్దు<<>> చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఇకపై స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో మూవీ కలెక్షన్లపై ప్రభావం పడనుంది.
Similar News
News February 3, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు

<
News February 3, 2026
వంటింటి చిట్కాలు

* గార్లిక్ బ్రెడ్ అందుబాటులో లేనప్పుడు కొన్ని వెల్లుల్లి రేకలను మెత్తగా చేసుకొని ఓ గంటపాటు పెరుగులో నానబెట్టి దాన్ని బ్రెడ్ స్లైసుల మీద పరిచి టోస్ట్ చేస్తే చాలు.
* కూరల్లో గ్రేవీ పలుచగా అయితే కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* మాంసాన్ని సన్నని స్లైసుల్లా తరగాలనుకుంటే, దానిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చాకుతో కోయాలి.
* సాంబారు రుచిగా ఉండాలంటే మసాలా పొడిలో కొద్దిగా నిమ్మరసం చేర్చాలి.
News February 3, 2026
నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

AP: రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఉదయం పార్లమెంట్‌కు వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. రేపు అర్ధరాత్రికి ఆయన తిరిగి ఉండవల్లికి చేరుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.


