News January 9, 2025

రేపు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్.. వారికి పోలీసుల సూచనలు

image

TG: ‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో HYDలో ‘గేమ్ ఛేంజర్’ ప్రదర్శించే థియేటర్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ చేశారు. రేపు ఆ సినిమా విడుదల సందర్భంగా నిబంధనలు పాటించాలని యజమానులను సూచించారు. థియేటర్ల వద్ద హడావుడి ఉండొద్దని, టికెట్ ఉన్న ప్రేక్షకులనే లోపలికి అనుమతించాలని స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

Similar News

News January 10, 2025

ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలి: సీఎం

image

TG: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని అధికారులు వివరించగా, వాటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని సీఎం సూచించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News January 10, 2025

‘సంక్రాంతి’ ప్రయాణికులపై ఛార్జీల భారం

image

TG: ‘సంక్రాంతికి’ సొంతూళ్లకు వెళ్లే ఆంధ్ర, తెలంగాణ ప్రయాణికులపై TGSRTC ఛార్జీల భారం మోపింది. పండగ సందర్భంగా నడపనున్న 6,432 స్పెషల్ బస్సుల్లో 50% వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. 10, 11, 12, 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. అటు మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ యథావిధిగా నడుస్తుందని తెలిపింది.

News January 10, 2025

నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం.. కీలక అంశాలపై చర్చ

image

TG: సీఎం రేవంత్ ఇవాళ మ.3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై చర్చించనున్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా పంపిణీని ప్రారంభిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.