News January 4, 2025
‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌కు విశేష స్పందన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ అదరగొడుతోంది. యూట్యూబ్‌తో సహా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఈ ట్రైలర్‌కు ఇప్పటివరకు 180+ మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేయగా.. ఇందులో చరణ్ స్టిల్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, 24 గంటల్లో ఈ మూవీ తెలుగు ట్రైలర్‌కు యూట్యూబ్‌లో 36.24M వ్యూస్ వచ్చాయి.
Similar News
News January 6, 2025
భారత్‌తో పెట్టుకుంటే ఇలాగే అవుతుంది.. ట్రూడోపై సెటైర్లు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీకి <<15076593>>రాజీనామా చేస్తారని<<>> వార్తలు రావడంతో భారతీయులు ఖుషీ అవుతున్నారు. ఖలిస్థానీలకు మద్దతు తెలిపి, ఇండియాపై నిరాధార ఆరోపణలు చేసినందుకు తగిన శాస్తి జరిగిందని పోస్టులు చేస్తున్నారు. ఇండియాకు హాని చేసే శక్తులు కెనడాలో ఉన్నా.. వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సపోర్ట్ చేశారని ఫైరవుతున్నారు. భారత్‌తో పెట్టుకుంటే ఇలాగే అవుతుందని ఎద్దేవా చేస్తున్నారు.
News January 6, 2025
‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌కు ఆటంకం?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు తమిళనాడులోని ‘లైకా ప్రొడక్షన్స్’ షాక్ ఇచ్చింది. డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్-3’ని పూర్తి చేయకుండా దిల్ రాజు తన ‘గేమ్ ఛేంజర్’ను TNలో విడుదల చేయొద్దని సూచించినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ తర్వాత ఇండియన్-3 మిగిలిన షూటింగ్ పూర్తిచేస్తామని శంకర్ లైకాకు తెలిపారని టాక్. దీనిపై చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి.
News January 6, 2025
No Hikes: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్!
ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాకిచ్చింది. వేతనాల పెంపును FY25 నాలుగో త్రైమాసికానికి వాయిదా వేసినట్టు తెలిసింది. అంటే ఏప్రిల్ వరకు పెంపు ఉండనట్టే. కంపెనీ చివరిసారిగా 2023 NOVలో హైక్ ఇవ్వడం గమనార్హం. సాధారణంగా ఇన్ఫీ 2025 ఆరంభంలోనే హైక్‌ను ప్రకటించాల్సింది. ప్రాఫిటబిలిటీ కోసం HCL TECH, LTI MINDTREE, L&T వేతనాల పెంపును వాయిదా వేయడంతో ఆ బాటలోనే నడిచింది. పర్ఫామెన్స్ బోనస్ మాత్రం సగటున 90% వరకు ఇచ్చింది.