News April 5, 2024
‘గేమ్ ఛేంజర్స్ ఆఫ్ ఇండియా’

ఉప్పల్ స్టేడియంలో ధోనీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్స్ ఆఫ్ ఇండియా’ అంటూ ఇద్దరి ఫొటోలతో పోస్టర్ క్రియేట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘ఒకరు ఐసీసీ ట్రోఫీల కింగ్.. మరొకరు బాక్సాఫీస్ కింగ్’ అంటూ పోస్టర్పై రాసుకొచ్చారు. ధోనీ-తారక్ ఫొటోలతో మరో పోస్టర్ను యంగ్ టైగర్ ఫ్యాన్స్ ప్రదర్శించారు.
Similar News
News January 22, 2026
లిక్కర్ స్కామ్ గురించి రాజ్ కసిరెడ్డికే తెలుసు: విజయసాయి

AP: లిక్కర్ స్కామ్కు సంబంధించిన పూర్తి సమాచారం రాజ్ కసిరెడ్డికే తెలుసని EDకి చెప్పినట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మిథున్ రెడ్డి కోరిక మేరకే రాజ్ కసిరెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశానన్నారు. మిథున్ సూచనతోనే అరబిందో నుంచి నిధులు సమకూర్చినట్లు వెల్లడించారు. సజ్జల శ్రీధర్, కసిరెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నారు. లిక్కర్ స్కాం కేసులో ఇవాళ HYDలో ED ఆయన్ను 7 గంటలకు పైగా విచారించింది.
News January 22, 2026
ఆస్కార్-2026 నామినీల లిస్ట్ విడుదల

ఆస్కార్ రేసులో నిలిచిన నామినీ పేర్లను అకాడమీ ప్రకటించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి పోటీ పడిన ‘హోమ్ బౌండ్’కి చోటు దక్కలేదు. ఈ విభాగంలో ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్), ఇట్ వాజ్ జస్ట్ యాన్ ఆక్సిడెంట్(ఫ్రాన్స్), సెంటిమెంటల్ వాల్యూ (నార్వే), సిరాట్(స్పెయిన్), ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ (ట్యునీషియా) చోటు దక్కించుకున్నాయి. విభాగాల వారీగా లిస్ట్ కోసం పైన ఫొటోలు స్లైడ్ చేయండి.
News January 22, 2026
కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారు: విజయసాయి

AP: మాజీ MP విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కూటమి ఇలాగే కొనసాగితే జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం కష్టమని అన్నారు. కూటమిని విడగొడితేనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఏపీ మద్యం స్కామ్ కేసులో ఈడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం లేని కేసుల్లో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.


