News December 16, 2024
మూడో రోజు ముగిసిన ఆట

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. రాహుల్(33*), రోహిత్ (0) క్రీజులో ఉన్నారు. ఇవాళ ఆటకు వాన ఆరు సార్లు అంతరాయం కలిగించింది. కాగా తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది.
Similar News
News January 6, 2026
బార్డర్లో చైనా శాశ్వత నిర్మాణాలు.. INDపై ఆధిపత్యానికేనా!

పాంగాంగ్ సరస్సు ఒడ్డున చైనా శాశ్వత నిర్మాణాలు చేస్తున్నట్టు శాటిలైట్ ఫొటోలు బయటకు వచ్చాయి. వివాదాస్పద ఈస్టర్న్ లద్దాక్ రీజియన్ సమీపంలో తాజాగా శాశ్వత భవనాలను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఏడాది పొడవునా ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం పెరుగుతుంది. వివాదాస్పద బార్డర్ ఏరియాలో చైనా శాశ్వత నిర్మాణాలు భారత్కు సవాలుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
News January 6, 2026
ఇంట్లో కృష్ణుడి విగ్రహం ఏ వైపున ఉండాలి?

ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో/విగ్రహాన్ని ఈశాన్య మూలలో ఉంచడం అత్యంత శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘విగ్రహం ముఖం తూర్పు/ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని నింపి, ఆర్థిక అభివృద్ధిని, సుఖసంతోషాలను చేకూరుస్తుంది. దక్షిణ, పశ్చిమ దిశలు, బెడ్రూమ్లో కృష్ణుడి పటాలను ఉంచడం వాస్తు రీత్యా నిషిద్ధమని గుర్తుంచుకోవాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 6, 2026
మనుషుల కేసుల్లో కూడా ఇన్ని అప్లికేషన్లు రావు: SC

వీధి కుక్కల కేసులో పెద్ద మొత్తంలో మధ్యంతర దరఖాస్తులు రావడంపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సాధారణంగా మనుషుల విషయంలో కూడా ఇన్ని అప్లికేషన్లు రావు’ అని జస్టిస్ మెహతా అన్నారు. ఈ కేసును ముగ్గురు జడ్జిల బెంచ్ రేపు విచారిస్తుందని తెలిపారు. కుక్క కాట్లు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరిలైజేషన్, టీకాల తర్వాత షెల్టర్లకు కుక్కలను తరలించాలని గతేడాది నవంబర్లో కోర్టు ఆదేశాలిచ్చింది.


