News March 14, 2025

టాటా కమ్యూనికేషన్స్ ఛైర్మన్‌గా గణపతి సుబ్రహ్మణ్యం

image

తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్‌గా టాటా సంస్థ గణపతి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. నామినేషన్-రెమ్యునరేషన్ కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన 2021లో బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. టీసీఎస్‌లో ఆయన గత 40 ఏళ్లుగా సేవలందించారు. ఆ సంస్థకు సీఓఓగా పనిచేసి గత ఏడాది మేలో పదవీవిరమణ చేశారు.

Similar News

News March 15, 2025

కెనడా కొత్త ప్రధానిగా కార్నీ ప్రమాణ స్వీకారం

image

కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించారు. దీంతో అధికార లిబరల్ పార్టీలో జరిగిన ఎన్నికల్లో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లకు గవర్నర్‌గా పనిచేసిన కార్నీ విజయం సాధించారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు క్షీణించిన వేళ కార్నీకి పెను సవాళ్లు ఎదురు కానున్నాయి.

News March 14, 2025

తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి: పవన్ కళ్యాణ్

image

AP: హిందీని తమిళనాడు వ్యతిరేకించడంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘అలా అయితే తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. నార్త్ సినిమాల నుంచి డబ్బులు కావాలి గానీ భాషలు వద్దా? భాషలపై వివక్ష ఎందుకు? సంస్కృతం, హిందీ మన భాషలే కదా? పనిచేసేవాళ్లు బిహార్ నుంచి రావాలి కానీ హిందీ మాత్రం వద్దా?’ అని పవన్ ప్రశ్నించారు.

News March 14, 2025

‘జియో హాట్‌స్టార్’ కీలక నిర్ణయం.. వారికి షాక్?

image

జియో, స్టార్ నెట్‌వర్క్, కలర్స్ టీవీల ప్రోగ్రామ్స్‌ను చాలామంది యూట్యూబ్‌లో చూస్తుంటారు. వారికి ‘జియో హాట్‌స్టార్’ షాకివ్వనుంది. ఆ సంస్థ యూట్యూబ్‌లో ఉన్న కంటెంట్‌ను తొలగించనుందని ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఓ కథనంలో తెలిపింది. దాని ప్రకారం.. తమ యాప్‌, శాటిలైట్ టీవీల్లో తప్ప వేరే ఏ స్ట్రీమింగ్ వేదికపైనా తమ కంటెంట్ రాకూడదని జియో హాట్‌స్టార్ భావిస్తోంది. యాప్‌లో చూడాలంటే పేమెంట్ చేయాల్సి ఉంటుందని సమాచారం.

error: Content is protected !!