News December 25, 2024

గాంధీ వందేళ్ల జ్ఞాపకం.. 2 రోజులు CWC సమావేశాలు

image

ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు, ఎల్లుండి కాంగ్రెస్ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే ఈ సమావేశానికి ‘నవ సత్యాగ్రహ బైఠక్’గా పేరు పెట్టింది. 26వ తేదీన CWC సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు సహా 200 మంది కీలక నేతలు హాజరై పలు అంశాలపై చర్చిస్తారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో లక్ష మంది కార్యకర్తలు పాల్గొంటారు.

Similar News

News November 24, 2025

రాష్ట్ర బ్యాంకుల్లో రూ.2,200 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్

image

TG: రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లోని 80 లక్షల ఖాతాల్లో రూ.2,200 కోట్ల అన్‌క్లెయిమ్డ్ సొమ్ము ఉన్నట్లు RBIకి సమర్పించిన నివేదికలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. SBIలోనే దాదాపు 21.62 లక్షల అకౌంట్లలో సుమారు రూ.590Cr ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ నిధులను ఖాతాదారులు లేదా వారి వారసులకు అందజేసేందుకు బ్యాంకులు ఈ ఏడాది DEC 31 వరకు ‘వారసుల వేట’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి.

News November 24, 2025

సందీప్ వంగా డైరెక్షన్ టీమ్‌లో స్టార్ కిడ్స్

image

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా పూజా కార్యక్రమం నిన్న జరిగిన విషయం తెలిసిందే. చిరంజీవి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ జరగగా, డైరెక్షన్ టీమ్ ఆయనతో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలో హీరో రవితేజ కుమారుడు మహాదన్, డైరెక్టర్ త్రివిక్రమ్ తనయుడు రిషి కూడా ఉన్నారు. వీరిద్దరూ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

News November 24, 2025

INDvsSA.. భారమంతా బ్యాటర్లపైనే!

image

IND, SA మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో నేడు మూడో రోజు ఆట కీలకం కానుంది. భారత్‌ విజయావకాశాలపై ఈరోజు ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. తొలి ఇన్నింగ్స్‌లో SA భారీ స్కోర్(489) చేయడంతో IND బ్యాటర్ల బాధ్యత మరింత పెరిగింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలంటే బ్యాటర్లు సమష్ఠిగా రాణించాల్సిన అవసరముంది. ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జైస్వాల్ కీలకంగా మారతారని అనిల్ కుంబ్లే అన్నారు. ప్రస్తుతం IND 480 రన్స్ వెనుకబడి ఉంది.