News October 2, 2024

స్వాతంత్ర్యం తర్వాత గాంధీ నిరాహార దీక్ష.. ఎందుకంటే?

image

భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ ఎన్నో దీక్షలు చేపట్టారు. అయితే, స్వాతంత్ర్యం అనంతరం కూడా రెండు డిమాండ్లతో 1948 జనవరి 13న ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. పాకిస్థాన్‌కు భారత్ రూ.55 కోట్లు ఇవ్వాలని, ఢిల్లీలో ముస్లింలపై జరుగుతున్న దాడులు ఆగాలని దీక్షలో కూర్చున్నారు. మతసామరస్యాన్ని నెలకొల్పేందుకు ఆయన ఇలా చేశారని చెబుతుంటారు. విభజన సమయంలో పాక్‌కు భారత్ రూ.75 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది.

Similar News

News October 2, 2024

హైడ్రాకు హై పవర్స్.. గవర్నర్ ఆమోదం

image

TG: హైడ్రాకు విశేష అధికారాలు కల్పించేలా ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. GHMC చట్టం 1955లో 374B సెక్షన్ చేరుస్తూ GOVT ఆర్డినెన్స్ జారీ చేసింది. ORR పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ హైడ్రాకు సర్వాధికారాలు కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందించారు.

News October 2, 2024

మెడికల్ పీజీలో సర్వీస్ కోటా పెంపు

image

AP: మెడికల్ పీజీ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 15% నుంచి 20శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో 15శాతానికే పరిమితం చేయడంతో PHC వైద్యులు ఆందోళనకు దిగారు. వారితో చర్చల అనంతరం ప్రభుత్వం ఇన్‌సర్వీస్ రిజర్వేషన్‌ను క్లినికల్ విభాగంలో 20శాతానికి పెంచగా, నాన్-క్లినికల్ సీట్లలో రిజర్వేషన్ మాత్రం 30శాతానికి పరిమితం చేశారు. ఈ ఏడాది నుంచే ఇది అమల్లోకి రానుంది.

News October 2, 2024

పండుగకు ఊరెళ్తున్నారా? జాగ్రత్త

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్త. ఇంట్లో బంగారం, డబ్బులు ఉంచవద్దు. బ్యాంకు లాకర్లలో పెట్టండి. లేదంటే వెంట తీసుకెళ్లండి. ఇంటిని గమనించాలని పక్కింటి వారికి చెప్పాలి. కాలనీల్లో, వీధుల్లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తేనే చోరీలను నియంత్రించవచ్చని పోలీసులు చెబుతున్నారు.