News September 17, 2024

ప్రశాంతంగా కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనం: మంత్రి పొన్నం

image

TG: రాష్ట్రంలో నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. రేపు వర్కింగ్ డే కావడంతో ఆలస్యం కాకుండా త్వరగా నిమజ్జనం చేయాలని నిర్వాహకులను కోరారు. హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి గణేశులు తరలివస్తుండడంతో ట్యాంక్‌బండ్‌పై జనసందోహం నెలకొంది. నగరంలో ఇప్పటికే ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాల నిమజ్జనాలు పూర్తయ్యాయి.

Similar News

News January 19, 2026

ECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని <>ECIL<<>>లో 20 టెక్నీషియన్, సూపర్‌వైజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్+వైవా ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in

News January 19, 2026

వరిలో అగ్గి తెగులు – నివారణకు సూచనలు

image

వరి దుబ్బు చేసే దశలో అగ్గి తెగులు కనిపిస్తుంది. దీని వల్ల వరి పైర్లలో ఆకులపై నూలు కండె ఆకారం మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద, వెన్నుల మీద గోధుమ రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్క వెన్నువిరిగి వేలాడుతుంది. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 75% 0.6gm లేదా అజాక్సీస్ట్రోబిన్+టెబుకోనజోల్ 2 ml కలిపి పిచికారీ చేసుకోవాలి.

News January 19, 2026

తిరుమల: లక్కీడిప్‌లో సులభంగా సెలెక్ట్ అవ్వాలంటే?

image

ఆన్‌లైన్ లక్కీడిప్‌లో పోటీ చాలా ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు దరఖాస్తు చేసుకోవడం వల్ల ఎంపికయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే తిరుమలలో నేరుగా రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీ అదృష్టం కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆన్‌లైన్ కంటే ఆఫ్‌లైన్ విధానంలో తక్కువ మంది పోటీ పడతారు కాబట్టి, సేవల్లో పాల్గొనే భాగ్యం త్వరగా లభిస్తుంది. తిరుమలకు వెళ్లినప్పుడు లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవడం మంచిది.