News September 17, 2024
గణేశ్ నిమజ్జనం.. మద్యం షాప్‌లు బంద్

TG: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో HYD వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచే మద్యం షాప్‌లు క్లోజ్ అయ్యాయి. రేపు సాయంత్రం 6 వరకు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ CV ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులిచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో మాత్రం యథావిధిగా మద్యం అందుబాటులో ఉండనుంది.
Similar News
News October 16, 2025
2026 టీ20 WC.. జట్లు ఖరారు

వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 WCకు UAE అర్హత సాధించింది. దీంతో టోర్నీలో పాల్గొనే మొత్తం 20 జట్లు ఖరారయ్యాయి. ఇండియా, శ్రీలంక, AFG, AUS, బంగ్లా, ENG, SA, USA, WI, ఐర్లాండ్, NZ, PAK, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, ZIM, నేపాల్, ఒమన్, UAE జట్లను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి 2 జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. అందులో నుంచి 4 టీమ్స్ సెమీస్ ఆడతాయి.
News October 16, 2025
IPS ఆఫీసర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు

పంజాబ్‌లోని రోపార్ రేంజ్ DIG, 2009 బ్యాచ్ IPS హర్చరణ్ సింగ్ భుల్లర్‌ను CBI అరెస్ట్ చేసింది. ₹8లక్షలు లంచం తీసుకుంటూ ఆయన అధికారులకు పట్టుబడ్డారు. హర్చరణ్ ఇల్లు, ఆఫీసులో సోదాలు చేసి ₹5Cr నగదు, 1.5kgs జువెలరీ, 22 లగ్జరీ వాచ్‌లు, ఆడి, మెర్సిడెస్ కార్లు, గన్స్&పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు మధ్యవర్తినీ అరెస్ట్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రేపు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.
News October 16, 2025
తాలిబన్లు మనకు శత్రువులా?

<<18023858>>అఫ్గానిస్థాన్<<>>లోని తాలిబన్లు నిరంతరం యుద్ధాల్లో ఉండటంతో వారు మనకూ శత్రువులేనా అని పలువురు అనుకుంటారు. మనకు, వారికి ఇప్పటివరకు విభేదాలు/శత్రుత్వం రాలేదు. 1999లో పాక్ లష్కరే తోయిబా ఉగ్రవాదులు నేపాల్-ఢిల్లీ IC 814 విమానాన్ని హైజాక్ చేశారు. దాన్ని అఫ్గాన్‌లో ల్యాండ్ చేశారు. తాలిబన్లకు చెడ్డపేరు వచ్చేందుకు ఆ ప్లాన్ చేశారు. కానీ తాలిబన్లు ఆ విమానానికి రక్షణగా ఉండటంతో పాటు ఎవరికీ అపాయం కలగకుండా చూశారు.