News September 15, 2024
గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైళ్ల సమయం పెంపు
TG: ఎల్లుండి ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సేవలను అధికారులు పొడిగించారు. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. చివరి స్టేషన్ నుంచి రాత్రి ఒంటిగంటకు మెట్రో రైలు బయల్దేరుతుందన్నారు. మరోవైపు అవసరాన్ని బట్టి నిమజ్జనం ముగిసే వరకు అదనపు రైళ్లు నడిపిస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News December 30, 2024
స్పేస్ డాకింగ్: నాలుగో దేశంగా భారత్
ISRO చేపడుతోన్న ‘స్పేడెక్స్ మిషన్’ సక్సెస్ అయితే ప్రపంచంలో స్పేస్ డాకింగ్ సాంకేతికత కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ టెక్నాలజీ విషయంలో US, రష్యా, చైనా ముందంజలో ఉన్నాయి. చంద్రయాన్-4, ఇండియన్ స్పేస్ సెంటర్ వంటి భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఈ డాకింగ్ టెక్నాలజీ కీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ తెలిపారు.
News December 30, 2024
ఒక్క సిగరెట్ తాగితే ఎంత జీవితం నష్టపోతారో తెలుసా?
ఒక సిగరెట్ తాగడం వల్ల పురుషులు 17 నిమిషాలు, మహిళలు 22 నిమిషాల జీవితాన్ని కోల్పోతున్నారని ఓ అధ్యయనం అంచనా వేసింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. ధూమపానం వల్ల ఎన్నేళ్ల జీవితాన్ని కోల్పోతారో, అన్నే ఏళ్లపాటు ఆరోగ్యంగా జీవించే కాలాన్ని కూడా కోల్పోతారని పరిశోధకులు పేర్కొన్నారు. జీవితం చివర్లో కంటే ఆరోగ్యవంతమైన మధ్య వయస్సును హరిస్తుందని వివరించారు.
News December 30, 2024
యూట్యూబ్‌లో టెన్త్ పేపర్.. నిందితుడు అరెస్ట్
AP: టెన్త్ హాఫ్ ఇయర్లీ పరీక్ష పేపర్లను యూట్యూబ్‌లో <<14900742>>అప్‌లోడ్ చేసిన<<>> అరుణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జామ్‌కు ముందు రోజు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌ను అరుణ్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ పరీక్షను రద్దు చేసి ఈ నెల 20న నిర్వహించారు.