News January 14, 2025

హ‌రియాణా BJP చీఫ్‌పై గ్యాంగ్ రేప్ కేసు

image

హ‌రియాణా BJP చీఫ్ మోహ‌న్ లాల్ బ‌డోలీపై హిమాచ‌ల్ పోలీసులు సామూహిక అత్యాచారం కేసు న‌మోదు చేశారు. HPలోని కసౌలిలో ఉన్న హోట‌ల్‌లో July 3, 2023న మోహ‌న్ లాల్, సింగ‌ర్ రాఖీ మిట్ట‌ల్ తనపై అత్యాచారం చేశార‌ని ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆరోపించారు. ప్ర‌భుత్వ ఉద్యోగం ఇప్పిస్తాన‌ని, మ్యూజిక్ వీడియోలో అవ‌కాశం ఇస్తాన‌ని నమ్మించిన వీరిద్దరూ దారుణానికి ఒడిగట్టారన్నారు. అయితే ఆమె ఎవరో తెలియదని మోహన్ లాల్ అన్నారు.

Similar News

News January 15, 2025

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ, రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. పార్టీ అధిష్ఠానంతో క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులనూ ఆయన కలవనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన అనంతరం సింగపూర్‌కు వెళ్లనున్న ఆయన ఈనెల 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. ఆ తర్వాత 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటిస్తారు.

News January 15, 2025

క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నా: యువరాణి కేట్

image

బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ తాను కాన్సర్ నుంచి బయటపడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు కాస్త రిలీఫ్‌గా ఉందని పూర్తిగా కోలుకోవడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. గత ఏడాది క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించిన కేట్ కొంతకాలంగా చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

News January 15, 2025

ఇది వెంకీ సార్ పొంగల్: అనిల్ రావిపూడి

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వస్తున్న స్పందన ఆనందం కలిగిస్తోందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. మూవీ సక్సెస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వెంకటేశ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకోవాలో తెలుసని, ఈ సంక్రాంతికి సరిగ్గా కుదిరిందని చెప్పారు. బెనిఫిట్ షోలకు ఫ్యామిలీస్ రావడం పెద్ద అచీవ్‌మెంట్ అని తెలిపారు. ఇది వెంకీ సార్ పొంగల్ అని పేర్కొన్నారు. సినిమాకు సపోర్ట్ చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.