News March 31, 2025
వివాహితపై సామూహిక అత్యాచారం

TG: నాగర్ కర్నూల్ (D) ఊర్కొండ(M)లో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. MBNR జిల్లాకు చెందిన ఆమె బంధువుతో కలిసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాలకృత్యాల కోసం గుట్ట ప్రాంతానికి వెళ్లగా, 8 మంది ఆ బంధువుపై దాడి చేసి అతని చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ తర్వాత వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనకు పాల్పడ్డ వారిని గుర్తించిన పోలీసులు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News April 4, 2025
గ్రూప్1 నియామకాలపై కేసుల కొట్టివేత

తెలంగాణలో గ్రూప్1 పోస్టుల భర్తీకి న్యాయ చిక్కులు తొలగాయి. జీవో నెం.29ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు కొట్టేసింది. దీంతో ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇచ్చిన TGPSC త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచే అవకాశముంది.
News April 4, 2025
GOLD: ది సిల్వర్ జూబిలీ స్టోరీ

మిలీనియమ్ ఇయర్ 2000లో భారత్లో 10 గ్రా. బంగారం సగటు ధర ₹4,400. తర్వాతి ఐదేళ్లలో ₹3వేలే పెరిగింది. ఆ తర్వాతి మూడేళ్లకు 2008లో ప్రపంచ మాంద్యంతో ₹13వేలకి చేరింది. 2018లో ₹30వేలు, 2020లో ₹50వేలు దాటింది. 2021లో ₹48వేలకు తగ్గినా 2022లో పెరిగి ₹55వేలకు వెళ్లింది. 2023లో ₹63వేలు, 2024లో ₹78వేలు పలికిన పసిడి ఇప్పుడు ₹90వేలపై కూర్చుంది. ఈ ఏడాది చివరికి లక్షకు చేరడం ఖాయమట. ఇది గోల్డ్ సిల్వర్ జూబిలీ కథ.
News April 4, 2025
దక్షిణ కొరియా అధ్యక్షుడిని తొలగించిన కోర్టు

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను పదవి నుంచి అధికారికంగా తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు తాజాగా తీర్పుచెప్పింది. గత ఏడాది డిసెంబరులో ఆయన బలవంతంగా దేశంలో మార్షల్ లా అమలుచేసేందుకు విఫల యత్నం చేశారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ఆయనపై ఆ దేశ పార్లమెంటులో అభిశంసన జరిగింది. తాజాగా ఆ అభిశంసనను సమర్థిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రజలనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.