News November 5, 2024
రాష్ట్రంలో ఘోరం.. మహిళపై గ్యాంగ్ రేప్
TG: HYD మధురానగర్లో దారుణం జరిగింది. ఓ మహిళ(50)పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. కూలీ చేసుకునే సదరు మహిళ కొండాపూర్లో పని ముగించుకుని నిన్న రాత్రి ఇంటికి వస్తుండగా ముగ్గురు అడ్డుకున్నారు. తమ గదిలో బట్టలు ఉతకాలని, డబ్బులు ఇస్తామని తీసుకెళ్లి ఓ రూమ్లో బంధించారు. అనంతరం నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.
Similar News
News November 5, 2024
2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధం.. IOA లేఖ
2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్ను భారత్లో నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ మేరకు క్రీడల నిర్వహణకు ఆసక్తిని కనబరుస్తూ ఒలింపిక్స్ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్కు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపింది. ఈ లేఖను Oct 1న పంపినట్టు తెలిసింది. గతంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ 2036లో ఒలింపిక్స్ నిర్వహణపై భారత ఆకాంక్షను వ్యక్తం చేశారు.
News November 5, 2024
సరస్వతి పవర్ భూములు పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్
AP: పల్నాడు జిల్లా మాచవరంలో సరస్వతి పవర్ భూములను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు పవన్ వద్ద వాపోయారు. ‘అప్పట్లో తక్కువ ధరకే భూములు లాక్కున్నారు. మా పిల్లలకు ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా కంపెనీ పెట్టలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ సంస్థకు ఇచ్చిన లీజును రద్దు చేయాలి. లేదంటే పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పించాలి’ అని వారు డిమాండ్ చేశారు.
News November 5, 2024
వైసీపీవి శవ రాజకీయాలు: అనిత
AP: వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. మాజీ సీఎం జగన్ తన ఇంటి గేటు దగ్గర సిబ్బందికే రూ.12 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేస్తున్నాం. అయినా కొన్ని నేరాలు జరుగుతుండటంతో బాధగా ఉంది. శిక్షలు అమలు చేసేందుకు ప్రత్యేక కోర్టులు కావాలి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకుంటాం’ అని ఆమె హెచ్చరించారు.