News April 1, 2025
మహిళపై గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు

TG: నాగర్ కర్నూల్ జిల్లాలో <<15944914>>మహిళపై గ్యాంగ్ రేప్<<>> ఘటనలో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఏడుగురు ఈ దారుణానికి ఒడిగట్టగా, దాదాపు 3 గంటలపాటు ఆమెను లైంగికంగా వేధించినట్లు చెప్పారు. దాహం వేస్తోందని బాధితురాలు మంచినీరు అడగగా మానవత్వం మరిచి నోట్లో మూత్రం పోసినట్లు తెలిపారు. కాగా నిన్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీరికి సహకరించిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Similar News
News April 2, 2025
ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు.. వాయుసేన ఆమోదం

TG: ఆదిలాబాద్లో ఎయిర్పోర్టును అభివృద్ధి చేసేందుకు వాయుసేన సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పౌరవిమానయాన అవసరాలకు తగినట్లుగా అక్కడ రన్వే పునర్నిర్మాణం, టర్మినల్, మౌలిక వసతుల ఏర్పాట్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఎయిర్పోర్టును సంయుక్త ప్రయోజనాలకు వాడేందుకు సమ్మతి తెలిపింది.
News April 2, 2025
1,161 ఉద్యోగాలు.. రేపే లాస్ట్

CISF భర్తీ చేయనున్న 1,161 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ గడువు APR 3తో ముగియనుంది. కానిస్టేబుల్/ట్రేడ్స్మెన్ పోస్టులకు మెట్రిక్యులేషన్ కలిగిన 18 – 23 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. అన్రిజర్వ్డ్, OBC, EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100 కాగా మహిళలు, SC, STలకు ఉచితం. వయసు 18-23ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.21,700-రూ.69,100 వరకు ఇస్తారు.
వెబ్సైట్: <
News April 2, 2025
వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు: అమిత్ షా

వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు జరుగుతుందని అమిత్షా స్పష్టం చేశారు. దీని ద్వారా వక్ఫ్ ఆదేశాలను కోర్టుల్లో సవాల్ చేయవచ్చన్నారు. ఈ బిల్లును చర్చి బోర్డులు కూడా సమర్థిస్తున్నాయని, ఇది అవినీతికి తప్ప ఏ మతానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. దీని ద్వారా మతాల మధ్య ఘర్షణ సృష్టించాలనే ఆలోచన తమకు లేదని ఆయన వివరించారు. ఈ బిల్లును తాము రాజ్యాంగబద్ధంగానే రూపొందించామని వెల్లడించారు.