News May 15, 2024

గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర

image

తిరుపతిలో జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతర ఇవాళ ప్రారంభమైంది. 900 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ జాతరను ఏటా 7 రోజులపాటు నిర్వహిస్తారు. ఈసారి మే 15 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నారు. కైకాల వంశస్థులు జాతరను చాటింపుతో ప్రారంభించడం ఇక్కడ ఆనవాయితీ. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మను భక్తులు తిరుమల శ్రీవారి చెల్లెలిగా కొలుస్తారు. వివిధ వేషాల్లో దేవతను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. జాతర టైమ్‌లో ఊరు విడిచి ఎటూ వెళ్లరు.

Similar News

News April 6, 2026

డిగ్రీలో పాఠాల కంటే ప్రాక్టికల్స్‌కే ప్రాధాన్యం!

image

TG: డిగ్రీ కోర్సుల స్వరూపం మారబోతోంది. పుస్తకాల్లోని పాఠాల కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. కోర్ సబ్జెక్టుల వెయిటేజీని 50-60%కి తగ్గించి, ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రాక్టికల్స్, ఇంటర్న్‌షిప్‌లకు 10-15% క్రెడిట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యేలా ఈ మార్పులు చేస్తున్నారు.

News April 6, 2026

కమలం పార్టీకి 47 ఏళ్లు

image

ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 1980 ఏప్రిల్ 6న ఏర్పడింది. అటల్ బిహారి వాజ్‌పేయి, LK అద్వానీ దీన్ని స్థాపించారు. 1984లో తొలిసారి సాధారణ ఎన్నికలను ఎదుర్కొని కేవలం 2 సీట్లలోనే గెలిచింది. రామజన్మభూమి ఉద్యమంతో 1989లో 75 సీట్లు వచ్చాయి. 1996లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1996, 98, 99లో వాజ్‌పేయి మూడు సార్లు ప్రధాని అయ్యారు. 2014 నుంచి మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారు.

News April 6, 2026

బ్రాండింగ్ కోసం బౌండరీ దాటిన జొమాటో.. ఫ్యాన్స్ ఫైర్!

image

నిన్నటి IPL మ్యాచ్ సందర్భంగా జొమాటో చేసిన ఓ పోస్ట్ తమిళనాడు, కర్ణాటక అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ‘చెన్నై సాంబార్ కంటే బెంగళూరు సాంబార్ బెటర్’ అంటూ ZOMATO చేసిన పోస్ట్ తమ ప్రాంతీయ సంస్కృతిని, ఆహారపు అలవాట్లను కించపరిచేలా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రచారం కోసం ప్రాంతీయ సెంటిమెంట్లతో ఆడుకోవడం సరికాదని ఫైర్ అవుతున్నారు. చాలామంది జొమాటో యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసి పోస్టులు పెడుతున్నారు.