News September 7, 2024

మాజీ సీఎంపై గ్యాంగ్‌స్టర్ భార్య పోటీ

image

హరియాణాలో కాంగ్రెస్‌ కీలక నేతను ఎదుర్కొనేందుకు BJP వ్యూహాలు రచిస్తోంది. గార్హీ నుంచి పోటీలో ఉన్న మాజీ CM భూపిందర్ సింగ్ హుడాపై గ్యాంగ్‌స్టర్ రాజేశ్ సర్కార్ భార్య మంజు హుడాను బరిలో నిలిపింది. మాజీ DSP ప్రదీప్ కూతురైన ఆమె ప్రస్తుతం రోహ్‌తక్ జిల్లా ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. భర్త గ్యాంగ్‌స్టర్, తండ్రి సీనియర్ పోలీస్ కావడంతో స్థానికంగా మంజూకు కలిసొస్తుందని BJP భావిస్తోంది. OCT 5న ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News December 3, 2025

ఎర్త్ సమ్మిట్ గ్రామీణాభివృద్ధికి ఉపయోగకరం: డీసీసీబీ ఛైర్మన్

image

గ్రామాలును అభివృద్ధి చేయటానికి ఎర్త్ సమ్మిట్ దోహదపడుతుందని విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం తెలిపారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత, ఆర్థిక నూతన పరిష్కారాలపై దృష్టి సారిస్తూ, NABARD, (IAMAI)లతో కలిసి డిసెంబర్ 5,6 తేదీల్లో గుజరాత్ గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న ఎర్త్ సమ్మిట్ 2025 జరుగుతుందన్నారు. బ్యాంక్ రైతులకు, మహిళా సంఘాలకు సేవలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

News December 3, 2025

లింగ భైరవి దేవత గురించి మీకు తెలుసా?

image

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపమే ‘లింగ భైరవి’. తాంత్రిక యోగంలో అత్యంత శక్తిమంతమైన ‘భైరవి’ రూపమే లింగాకారంలో ఉండటం వలన దీనిని లింగభైరవి అని పిలుస్తారు. కోయంబత్తూరులో ఈ ఆలయం ఉంది. భక్తులు తమ జీవితంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత, ఆరోగ్యం, వ్యాపారం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. భైరవి సాధనతో భావోద్వేగ బుద్ధిని పెరుగుతుందని నమ్మకం.

News December 3, 2025

మరోసారి వార్తల్లో కర్ణాటక సీఎం.. వాచ్ ప్రత్యేకతలివే

image

కర్ణాటకలో కుర్చీ వివాదం సద్దుమణగక ముందే CM సిద్దరామయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శాంటోస్ డి కార్టియర్ మోడల్ లగ్జరీ వాచ్ ధర రూ.43 లక్షల 20 వేలు. 18K రోజ్ గోల్డ్‌తో తయారైంది. సిల్వర్ వైట్ డయల్‌లో గంటలు, నిమిషాలు, సెకన్ల పిన్స్ సెల్ఫ్ వైండింగ్ మెకానికల్ మూవ్‌మెంట్‌తో పని చేస్తాయి. 6వ నంబర్ ప్లేస్‌లో డేట్ ఫీచర్, 39.88mm వెడల్పు, 9mm మందం ఉంది.