News September 23, 2025
మరోసారి క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ సంఘం(CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిన్న జరిగిన క్యాబ్ 94వ వార్షిక సదస్సుల్లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2015-19లో దాదా CAB అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈడెన్ గార్డెన్ సీట్ల సామర్థ్యం పెంపుపై ఆయన ఫోకస్ చేయనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా-టీమ్ ఇండియా తొలి టెస్టు ఈడెన్‌లోనే జరగనుంది. చివరగా 2019లో ఇక్కడ టెస్టు మ్యాచ్ జరిగింది.
Similar News
News February 4, 2026
రబీ సాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రబీ పంటకు సాగునీటి సరఫరాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. సాగునీటి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
News February 4, 2026
మన్యం: నీటి సంఘాల సమావేశాలకు జిల్లా నుంచి 8 బస్సులు

ఈనెల 5 తేదీన విజయవాడలో జరగబోయే నీటి సంఘాల సమావేశానికి మన్యం జిల్లా నుంచి బస్సులను కలెక్టర్‌తో మాట్లాడి ఏర్పాటు చేశామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మన్యం జిల్లా నుంచి 8 బస్సులు బుధవారం ఉదయం బయలుదేరుతాయని పేర్కొన్నారు. సమావేశం అనంతరం తిరిగి అదే బస్సుల్లో నీటి సంఘాల ఛైర్మన్‌లు, పాలక వర్గ సభ్యులు తిరిగి జిల్లాకు చేరుకుంటారని మంత్రి తెలిపారు.
News February 4, 2026
శుభ సమయం (04-2-2026) బుధవారం

➤ తిథి: బహుళ తదియ రా.1.46 వరకు తదుపరి చవితి ➤ నక్షత్రం: పుబ్బ రా.12.01 వరకు ➤ శుభ సమయాలు: ఉ.6.32-7.51 వరకు, ఉ.9.30-ఉ.10.18 వరకు తిరిగి మ.12.34 నుంచి మ.3.00 వరకు ➤ రాహుకాలం: ప.12.00- 1.30 వరకు ➤ యమగండం: ఉ.7.30-ఉ.9.00 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.11.49-మ.12.34 వరకు ➤ వర్జ్యం: ఉ.7.52-ఉ.9.29 వరకు ➤ అమృత ఘడియలు: సా.5.33 నుంచి రా.7.10 వరకు


