News August 6, 2025

మరోసారి CAB అధ్యక్షుడిగా గంగూలీ?

image

BCCI మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉంది. SEP 20న CAB వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుండగా, దాని కంటే ముందే తాను నామినేషన్ దాఖలు చేస్తానని గంగూలీ మీడియాకు వెల్లడించారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గంగూలీ గతంలోనూ CAB అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం CAB ప్రెసిడెంట్‌గా ఆయన సోదరుడు స్నేహాశిష్ ఉన్నారు.

Similar News

News August 6, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.

News August 6, 2025

కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా రికార్డు

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యధిక కాలం (2,258 రోజులు) కేంద్ర హోంమంత్రిగా పని చేసిన నేతగా నిలిచారు. 2019 మే 20న పదవీ బాధ్యతలు తీసుకున్న ఆయన అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎల్.కె. అద్వానీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. వాజ్‌పేయి హయాంలో అద్వానీ 2,256 రోజులపాటు హోమ్ మినిస్టర్‌గా పనిచేశారు.

News August 6, 2025

నార్త్ అమెరికా బుకింగ్స్‌లో లీడ్‌లో ‘కూలీ’

image

రజినీకాంత్ ‘కూలీ’, హృతిక్-NTR నటించిన ‘WAR-2’ సినిమాలు ఒకే రోజున (AUG 14) విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నార్త్ అమెరికా ప్రీమియర్స్ బుకింగ్స్‌లో ‘వార్-2’ కంటే ‘కూలీ’ లీడ్‌లో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు 44,159 టికెట్ల బుకింగ్‌తో ‘కూలీ’ ప్రీ సేల్స్ $1.16Mకి చేరాయి. ‘వార్-2’ ప్రీ సేల్స్ $213.3Kగా ఉన్నాయి. ‘వార్-2’తో పోలిస్తే ‘కూలీ’ బుకింగ్స్ దాదాపు 6 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.