News December 30, 2024
జనసేనలో చేరిన గంజి చిరంజీవి, జయమంగళం

AP: మంగళగిరి వైసీపీ నేత గంజి చిరంజీవి జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. గత ఎన్నికలకు ముందు ఈయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ (కైకలూరు) సైతం జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
Similar News
News November 28, 2025
మహమూద్పట్నం పంచాయతీ ఎన్నిక నిలిపివేత

TG: మహబూబాబాద్(D) మహమూద్పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 2025 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా 2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్లు సరికాదంది. అక్కడ ఉన్న ఆరుగురు STలకు సర్పంచి, 3 వార్డులను కేటాయించడాన్ని తప్పుపట్టింది. తదుపరి విచారణను డిసెంబరు 29కి వాయిదా వేసింది. ఈ ఎన్నికలో రిజర్వేషన్ను సవాల్ చేస్తూ యాకూబ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం.. ఎంత పుణ్యమో తెలుసా?

వైష్ణవాలయాల్లో ఏడాదంతా మూసి ఉండే ఉత్తర ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడు తెరుచుకుంటాయి. శ్రీవారి దర్శనార్థం 3 కోట్ల దేవతల రాకను సూచిస్తూ వీటిని తెరుస్తారు. ఇందులో నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుంటే స్వర్గంలోకి ప్రవేశించినంత పవిత్రంగా భావిస్తారు. అలాగే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇందుకు సంబంధించి టికెట్లను TTD నిన్న విడుదల చేసింది. ☞ వాటిని ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 28, 2025
‘ఫ్రైస్వాల్’ ప్రత్యేకత.. ఒక ఈతలో 4వేల లీటర్ల పాలు

హోలిస్టిన్ ఫ్రీజియన్, సాహివాల్ జాతుల కలయికతో రూపొందిన హైబ్రీడ్ ఆవు ‘ఫ్రైస్వాల్’. ఇది ఒక ఈత కాలంలో 4 వేల లీటర్ల పాలను ఇస్తుంది. దీనిలో అధిక పాలిచ్చే హెచ్.ఎఫ్. ఆవు గుణాలు 62.5%, వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకునే సాహివాల్ ఆవు గుణాలు 37.5%గా ఉంటాయి. ఈనిన తర్వాత 300 రోజుల పాటు 4% కొవ్వు కలిగిన 4 వేల లీటర్ల పాల దిగుబడిని ఫ్రైస్వాల్ ఆవు ఇస్తుందని ICAR ప్రకటించింది.


