News January 6, 2025

గన్నవరం TDP ఆఫీసు ఘటన.. పిటిషన్లు కొట్టివేత

image

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 17 మంది తమను అరెస్ట్ నుంచి కాపాడాలని కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ కేసులో మొత్తం 89 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ A71గా ఉన్నారు.

Similar News

News January 25, 2026

నో కాస్ట్ EMI.. మీకు ఈ విషయాలు తెలుసా?

image

‘నో కాస్ట్ EMI’తో ఆన్‌లైన్‌లో వస్తువులు కొంటే వడ్డీ ఉండదని అనుకుంటాం. కానీ వస్తువు ధరలోనే వడ్డీ కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ‘నో కాస్ట్ EMI వల్ల భారీ డిస్కౌంట్లు కోల్పోతారు. అదనంగా ప్రాసెసింగ్ ఫీజు+GST కూడా చెల్లించాల్సి వస్తుంది. ఎక్కువ EMIల వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ పెరిగి సిబిల్ స్కోర్ తగ్గొచ్చు’ అని పేర్కొంటున్నారు. కొనేముందు అసలు ధరతో EMI ధర కంపేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

News January 25, 2026

UK ప్రధాని ఫైర్.. వెనక్కి తగ్గిన ట్రంప్!

image

అఫ్గాన్ యుద్ధంలో US మినహా ఇతర నాటో దేశాల సైనికులు సరిగా పోరాడలేదన్న ట్రంప్ వ్యాఖ్యలపై UK PM స్టార్మర్ <<18942081>>ఫైరయిన<<>> సంగతి తెలిసిందే. దీంతో UK ఆర్మీని ప్రశంసిస్తూ ట్రంప్ SMలో పోస్ట్ పెట్టారు. ‘UK సైనికులు ధైర్యవంతులు, గొప్పవారు. ఎప్పుడూ USతోనే ఉంటారు. ఈ బంధం ఎప్పటికీ విడిపోలేనంత బలమైనది. AFGలో 457 మంది UK సైనికులు చనిపోయారు. వారంతా గొప్ప యోధులు’ అని ట్రంప్ పేర్కొన్నారు.

News January 25, 2026

జనవరి 25: చరిత్రలో ఈ రోజు

image

1918: రష్యన్ సామ్రాజ్యం నుంచి “సోవియట్ యూనియన్” ఏర్పాటు
1969: సినీ నటి ఊర్వశి జననం
1971: 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు
✰ జాతీయ పర్యాటక దినోత్సవం
✰ ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
✰ జాతీయ ఓటర్ల దినోత్సవం