News October 15, 2024
‘లుక్ అవుట్’ పేరుతో ఎయిర్పోర్టులో సజ్జల అడ్డగింత: YCP

AP: TDP ఆఫీసుపై దాడి ఘటన కేసులో సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని YCP విమర్శించింది. సజ్జల రామకృష్ణారెడ్డి, అవినాశ్, అప్పిరెడ్డి, తలశిల రఘరాంపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనమంది. నిన్న విదేశీ పర్యటన ముగించుకుని వస్తున్న సజ్జలను ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ నోటీసు పేరుతో అడ్డుకున్నారని తెలిపింది. ఆయన విదేశాలకు వెళ్లేటప్పుడు లేని నోటీసు ఇప్పుడేంటని ప్రశ్నించింది.
Similar News
News October 27, 2025
ఉపవాసాల వెనుక ఉద్దేశ్యం ఇదే..

ధార్మిక ఆచరణలు ప్రారంభించే ముందు శరీరాన్ని, మనస్సును పవిత్రం చేసుకోవాలి. అందులో భాగంగానే ఉపవాసం ఉంటారు. భౌతిక సుఖాలను తాత్కాలికంగా త్యజించడం దీని పరమార్థం. అయితే ఉపవాసమంటే ఆహారం పూర్తిగా మానడం కాదు. ఇది దయ, ఓర్పు, శాంతి వంటి మంచి లక్షణాలను పెంపొందిస్తుంది. కోరికలు, లోభం వంటి చెడు గుణాలను దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక గుణాలు లేకుండా, ఉపవాసం పాటిస్తూ కడుపు మాడ్చుకుంటే ఎలాంటి ఫలితం లభించదు. <<-se>>#Aushadam<<>>
News October 27, 2025
పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల

TG: పత్తి అమ్మకాల విషయంలో రైతులు నాణ్యత, తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి తేమ 12% మించకుండా చూసుకోవాలన్నారు. 12శాతం మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని తెలిపారు. గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయమై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
News October 27, 2025
భారత్తో టెస్ట్ సిరీస్.. SA జట్టు ప్రకటన

వచ్చే నెలలో భారత్తో జరగనున్న రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్కు 15 మంది కూడిన జట్టును SA ప్రకటించింది. కెప్టెన్గా టెంబా బవుమా వ్యవహరించనున్నారు. మార్క్రమ్, బాష్, బ్రెవిస్, టోనీ, రికెల్టన్, స్టబ్స్, వెరైన్, హమ్జా, హార్మర్, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, ముల్డర్, జాన్సన్, రబాడ ఎంపికయ్యారు. నవంబర్ 14న తొలి టెస్టు కోల్కతాలో, రెండోది 22న గువాహటిలో జరుగుతాయి.


