News July 1, 2024
మద్యం నిల్వ కేసులో మురుగుడు లావణ్య తండ్రి అరెస్ట్

AP: అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో మంగళగిరి YCP అభ్యర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య తండ్రి కాండ్రు శివనాగేంద్రం అరెస్టయ్యారు. ఓ ఇంట్లో నిల్వ చేసిన 6,528 మద్యం సీసాలను ఇటీవల సెబ్ అధికారులను సీజ్ చేశారు. ఈ కేసులో శివనాగేంద్రంను అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించింది. కాగా లావణ్యపై మంత్రి నారా లోకేశ్ 90వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే.
Similar News
News April 16, 2026
మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా?.. లోకేశ్‌కు YCP కౌంటర్

AP: వైఎస్ జగన్ తల్లిని, చెల్లిని తరిమేశారంటూ మంత్రి లోకేశ్ చేసిన <<19664163>>విమర్శలకు<<>> వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా? ఏ రోజు అయినా ఇంటికి పిలిచి పట్టెడన్నం పెట్టావా? మీ బాబాయ్ రామ్మూర్తి నాయుడిని ఎందుకు గొలుసులతో కట్టేశారు? మీ నాన్నమ్మ చనిపోతే మీ నాన్న ఎందుకు తలకొరివి కూడా పెట్టలేదు? నువ్వు ఒకటి అంటే మేము పది అనగలం. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’ అని వార్నింగ్ ఇచ్చింది.
News April 16, 2026
SRHకు షాక్.. IPL నుంచి మరో బౌలర్ ఔట్

IPL: SRH బౌలర్ డేవిడ్ పేన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఆయన కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా అంతకుముందు గాయంతో టోర్నీకి దూరమైన జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో <<19463818>>పేన్<<>> జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
News April 16, 2026
ఏపీలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభం.. వివరాలు నమోదు చేసుకున్న సీఎం

AP: స్వీయ జనగణనలో భాగంగా CM చంద్రబాబు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. http://se.census.gov.in సైట్ ద్వారా మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ సీఎంకు వివరించారు. ఈ నెల 30 వరకు ప్రజలు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. మే 1 తేదీ నుంచి 30 వరకూ అధికారులు క్షేత్రస్థాయిలో ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని తెలిపారు.


