News February 22, 2025
చెత్త పన్ను రద్దు.. ఉత్తర్వులు జారీ

AP: నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులిచ్చింది. 2024 DEC 31 నుంచి రద్దు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. 2021 NOVలో చెత్త పన్ను వసూలు ప్రారంభమైంది. దీన్ని రద్దు చేస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించగా, గవర్నర్ అనుమతితో ఇటీవల గెజిట్ విడుదలైంది.
Similar News
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.
News November 22, 2025
మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.
News November 22, 2025
సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము

AP: విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, ఆయన సందేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారన్నారు.


