News September 20, 2024
జనసేనలోకి తోట త్రిమూర్తులు?

AP: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేనలో చేరే అవకాశం ఉంది. తన సంబంధీకుడైన సామినేని ఉదయభాను ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. జనసేన పెద్దల వద్ద సామినేని ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. అయితే, కూటమిలో మూడు పార్టీలకు ఆమోదమైతేనే చేర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గత వారం YS జగన్ పిఠాపురంలో పర్యటించినప్పుడూ తోట దూరంగా ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
Similar News
News December 1, 2025
భార్య పదవిని భర్త అనుభవిస్తే వేటు తప్పదు!

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్ ఉన్నచోట్ల భర్తలు తమ భార్యలతో నామినేషన్ వేయించారు. కొన్నిచోట్ల భార్యలను ఇంటికి పరిమితం చేసి వారి పదవిని భర్తలు అనుభవిస్తుంటారు. ఇలా చేయడం రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశమైన మహిళా సాధికారతకు ఆటంకం కలిగించడమే. ఎన్నికైన మహిళా సర్పంచ్ అధికారాలను ఆమె భర్త అనుభవిస్తే అది అధికారాల దుర్వినియోగంగా గుర్తించి పదవిలో నుంచి తొలగించే అవకాశం ఉంది. SHARE IT
News December 1, 2025
13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షల అడ్మిట్ కార్డులను IBPS విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. కాగా ప్రస్తుతం ఉచిత మాక్ టెస్టులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: https://www.ibps.in/
News December 1, 2025
మనకోసం మనకంటే ముందుగా (1/2)

మనిషి స్పేస్ జర్నీ ఈజీ చేసేందుకు మనకంటే ముందు కొన్ని ప్రాణులు స్పేస్‌లోకి వెళ్లాయి. 1947లో USA సైంటిస్ట్స్ ఫ్రూట్ ఫ్లైస్(ఓ జాతి ఈగ)ను పంపారు. రేడియేషన్, జీవక్రియ, ప్రత్యుత్పత్తి తదితరాలపై రీసెర్చ్ కోసం పంపిన అవి తిరిగొచ్చాయి. 1949లో కోతిని పంపగా పారాచూట్ ఫెయిలై వెనక్కి రాలేదు. 1957లో స్పుత్నిక్2లో వీధి కుక్క లైకాను రష్యా పంపింది. భూ కక్ష్యలో అడుగుపెట్టిన తొలి జంతువు ఆ వెదర్‌లో కొంతసేపే బతికింది.


