News September 7, 2024

గణపతి పూజలో ‘గరిక’కు ప్రాధాన్యం.. కారణం ఇదే!

image

చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే వినాయకుడు లోటుగా భావిస్తాడని పూజారులు చెబుతున్నారు. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడి పుట్టించి దేవతల్ని ఇబ్బందులకు గురిచేశాడట. ఆ రాక్షసుడిని గణేశుడు మింగేయడంతో ఆయన శరీరం వేడిగా మారిందట. దీంతో రుషుల సూచనతో 21 గరిక పోచలను స్వామి తలపై పెట్టగా, వేడి తగ్గిపోయిందట. అందుకే పూజలో గరికకు ప్రాధాన్యం దక్కినట్లు చెబుతారు.

Similar News

News December 6, 2025

మీ పిల్లలు చేసే ఈ పనులను సరిదిద్దండి

image

పిల్లలు చేసే కొన్ని పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. కానీ అవే భవిష్యత్‌లో సమస్యలుగా మారే ప్రమాదముంది. పెద్దలు మాట్లాడేటప్పుడు అడ్డుకోవడం, ఏదైనా షేర్ చేసుకోకుండా మొండిగా ఉండటం, అబద్ధాలు చెప్పడం, దుకాణాల్లో మారాం చేయడం.. ఇవన్నీ చిన్న వయసులోనే మార్చాల్సిన అలవాట్లు. ఎక్కువ సమయం ఫోన్ చూడటం, మాట వినకపోవడం వంటి ప్రవర్తనలు కూడా వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. మృదువైన హెచ్చరికతో పిల్లలను సరిదిద్దాలి.

News December 6, 2025

ECIL హైదరాబాద్‌లో ఉద్యోగాలు‌

image

హైదరాబాద్‌లోని<> ECIL <<>>15 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రాజెక్ట్ ఇంజినీర్-C, టెక్నికల్ ఎక్స్‌పర్ట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ, బీటెక్ , సీఎంఏ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు నెలకు రూ.40వేలు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌కు రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in/

News December 6, 2025

నాణ్యమైన బొగ్గురాక విద్యుదుత్పత్తిలో సమస్య

image

TG: నాణ్యమైన బొగ్గురాక డిమాండ్‌కు తగ్గ విద్యుదుత్పత్తిలో జెన్‌కో సమస్య ఎదుర్కొంటోంది. నాసిరకం బొగ్గువల్ల థర్మల్ ప్లాంట్ల యంత్రాలూ దెబ్బతింటున్నాయి. ఇది సరఫరాపై ప్రభావం చూపి బయటి నుంచి అధిక ధరకు కొనే పరిస్థిితి వస్తోంది. దీంతో క్వాలిటీ కోల్ కోసం సింగరేణికి లేఖ రాసింది. బకాయిపడ్డ ₹15000 CR అంశాన్నీ పరిష్కరించింది. క్వాలిటీ బొగ్గు సరఫరాకు అంగీకారం కుదుర్చుకుంది. ఇక నిర్ణీత 4200mw ఉత్పత్తి చేయనుంది.