News August 8, 2024
రూ.500కే గ్యాస్ సిలిండర్.. మరో గుడ్ న్యూస్!

TG: రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. గ్యాస్ రాయితీ సొమ్మును 2 రోజుల్లో వినియోగదారుల ఖాతాల్లో జమ చేయాలని CM రేవంత్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సబ్సిడీ డబ్బులు జమ అయ్యేందుకు నాలుగైదు రోజులు పడుతోంది. మరోవైపు ఈ స్కీం ప్రారంభించినప్పుడు 39.50 లక్షలుగా ఉన్న లబ్ధిదారులు ప్రజాపాలన కేంద్రాల్లో సవరణకు అవకాశం ఇవ్వడంతో తాజాగా 44.10 లక్షలకు చేరారు.
Similar News
News January 28, 2026
నేషనల్ ఫిజికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని CSIR-నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ 18 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఎస్సీ, డిప్లొమా అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 9 వరకు పంపాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.72,240 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nplindia.in
News January 28, 2026
విగ్రహమొక్కటే.. దేవుళ్లెందరో!

అనంతపురం(D) పంపనూరు సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది. విజయనగర రాజగురువు వ్యాసరాజు ప్రతిష్టించిన ఇక్కడి విగ్రహం ఒకేచోట శివకుటుంబాన్ని, విష్ణుతత్వాన్ని ప్రదర్శిస్తుంది. విగ్రహంలో శివలింగం, శ్రీచక్రం, సప్తశిరస్సుల పాముతో పాటు గణపతి, నరసింహస్వామి కూడా ఉంటారు. ఇక్కడ 9/11 మంగళవారాలు ప్రదక్షిణలు చేస్తే నాగ, రాహుకేతు, కాలసర్ప దోషాలు తొలగి సంపద, సంతానం, వ్యాపార అభివృద్ధి కలుగుతుందని నమ్మకం.
News January 28, 2026
బ్లాక్ బాక్స్‌తో తెలియనున్న ప్రమాద కారణాలు!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల అసలు కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ చెక్ చేయాల్సిందే. విమానం వేగం, ఇంధనం వంటి దాదాపు 80 రకాల సాంకేతిక అంశాలను ఇది రికార్డు చేస్తుంది. పైలట్ల మాటలు, కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చిన సూచనలు, కాక్‌పిట్‌లో వినిపించే శబ్దాలను ఇది భద్రపరుస్తుంది. ప్రస్తుతం అధికారులు బ్లాక్ బాక్స్‌ను వెలికితీసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.


