News February 1, 2025
స్వల్పంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 తగ్గించాయి. ఈ నిర్ణయంతో ఢిల్లీలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1797కి చేరింది. ఈ రేటు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పూ లేదు.
Similar News
News February 7, 2026
వైభవ్ మరో 2 నెలలు ఆగాల్సిందే!

హిట్టింగ్‌తో రికార్డులు సృష్టిస్తోన్న వైభవ్‌ను T20WC జట్టులోకి తీసుకోవాలనే <<19070036>>డిమాండ్లు<<>> పెరుగుతున్నాయి. కానీ అతడి ఎంపిక సాధ్యం కాదు. వైభవ్ DOB 27/3/2011. 2026 మార్చి 27 తర్వాతే అతనికి బీసీసీఐ ద్వారాలు తెరిచే అవకాశం ఉంది. ఆటగాళ్ల శారీరక, మానసిక భద్రత దృష్ట్యా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడటానికి కనీస వయసును 15 ఏళ్లుగా ఐసీసీ 2020లో నిర్ణయించింది.
News February 7, 2026
నువ్వుల పంటలో ఆకుముడత, కాయ తొలుచు పురుగుల నివారణ ఎలా?

నువ్వుల పంట లేత దశలో, చిన్న గొంగళి పురుగులు 2-3 ఆకులను దగ్గరకు చేర్చి గూడు కట్టుకొని పచ్చని పదార్థం గోకి తింటాయి. దీని వల్ల ఆకులు ఎండిపోయి, కాలిపోయినట్లు కనిపిస్తాయి. ఈ పురుగులు మొగ్గ ఏర్పడే దశలో పూ మొగ్గలను, పూతను మరియు కాయల్లోని గింజలను తింటూ పంటకు నష్టం కలగజేస్తాయి. ఈ కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News February 7, 2026
కర్నూలు WDCWలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

AP: కర్నూలు మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ(<


