News April 9, 2025
గ్యాస్ ధరల పెంపు.. వారిపై నో ఎఫెక్ట్

TG: కేంద్రం వంట గ్యాస్ ధరల పెంపు నిర్ణయం మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు వర్తించదు. ధరలు పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే సిలిండర్ ఇస్తానని ప్రకటించడమే దీనికి కారణం. దీంతో ఈ పెంపు ఎఫెక్ట్ మిగిలిన LPG గ్యాస్ వినియోగదారులపై పడనుంది. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కుటుంబాలపై అదనపు భారం పడనుండగా 39 లక్షల మహాలక్ష్మి లబ్ధిదారులకు ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి ధర రూ.905-రూ.928.50కి చేరింది.
Similar News
News December 29, 2025
ప్రపంచంలో షార్టెస్ట్ ఫ్లైట్ రూట్.. 90 సెకన్లలో..

స్కాట్లాండ్లోని వెస్ట్రే-పాపా వెస్ట్రే దీవుల మధ్య ఓ చిన్న విమానం 2.7KM దూరాన్ని కేవలం 90 సెకన్ల నుంచి 2 ని.ల్లో చేరుకుంటుంది. అంటే సీట్ బెల్ట్ పెట్టుకునే సమయం కంటే తక్కువ టైమ్లోనే ల్యాండ్ అవుతుందన్న మాట. రోజూ 8-10 మందితో రాకపోకలు సాగిస్తోంది. విద్యార్థులు, టీచర్లు, డాక్టర్లు ఎక్కువగా వినియోగిస్తారు. బ్రిడ్జి కట్టేందుకు ఎక్కువ ఖర్చు, పడవల్లో ఎక్కువ సమయం వల్ల ఫ్లైట్ బెటర్ ఆప్షన్గా ఎంచుకున్నారు.
News December 29, 2025
ఉత్తర ద్వార దర్శనం.. ఏ సమయంలో చేసుకోవడం ఉత్తమం?

వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజామునే చేసుకోవడం శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ఏకాదశి తిథి రేపు ఉదయం 7:51కి మొదలై, ఎల్లుండి పొద్దున5:01 వరకు ఉంటుంది. శాస్త్రరీత్యా డిసెంబర్ 30నే వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తారు. అందువల్ల ఈ శుభ దినాన ఏ సమయంలో శ్రీనివాసుడిని దర్శించుకున్నా.. అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. భక్తితో చేసే ఈ దర్శనం అజ్ఞానాన్ని తొలగించి, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది.
News December 29, 2025
హైదరాబాద్లో 80 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


