News April 12, 2025

గ్యాస్ సబ్సిడీ జమ కాలేదా?

image

AP: ఆధార్/రేషన్‌కార్డుతో గ్యాస్ కనెక్షన్ లింక్ కాకపోవడంతో పలువురికి దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందడం లేదు. మార్చి 31 నాటికి దాదాపు 14వేల మందికి సబ్సిడీ సొమ్ము బ్యాంకు అకౌంట్‌లో జమ కాలేదు. దీంతో ప్రజలు ఏజెన్సీలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్తగా ఆన్‌లైన్‌లో దీపం-2 డ్యాష్‌బోర్డును సిద్ధం చేసింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

Similar News

News April 13, 2025

ఏడాది చదువుకు దూరమైన బాలిక నేడు జిల్లా టాపర్

image

AP: కర్నూలు(D) ఆదోనికి చెందిన పేదింటి విద్యార్థిని నిర్మల ఇంటర్‌ బైపీసీలో 966 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. 2021-22లో టెన్త్‌లో 537 మార్కులు సాధించినప్పటికీ కుటుంబ ఆర్థిక సమస్యలతో బాలిక ఏడాదిపాటు చదువుకు దూరమైంది. అప్పటి కలెక్టర్ సృజన ప్రోత్సాహంతో ఆమె ఆస్పరి KGBVలో చేరింది. ఫస్టియర్‌లో 420, సెకండియర్‌లో 966 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది.

News April 13, 2025

అభిషేక్ వద్ద అప్పటి నుంచే ఆ నోట్ ఉంది: హెడ్

image

PBKSతో నిన్నటి మ్యాచ్‌లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ అనంతరం క్రేజీ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. 40 బంతుల్లోనే శతకం బాదిన క్రమంలో ఆరెంజ్ ఆర్మీకి <<16080847>>ఓ నోట్<<>> చూపించారు. దానిపై ఆ జట్టు మరో ఓపెనర్ హెడ్ స్పందించారు. ‘అభిషేక్ జేబులో ఆ నోట్ 6 మ్యాచ్‌ల నుంచి అలాగే ఉంది. ఉప్పల్‌లో అది బయటకు రావడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. మరోవైపు, అభిషేక్ 55 బంతుల్లోనే 141 రన్స్ బాది మ్యాచ్‌ను వన్ సైడ్ చేశారు.

News April 13, 2025

892 మార్కులొచ్చినా.. ఇంటర్ విద్యార్థిని ఫెయిల్

image

AP: విజయవాడ పటమటకు చెందిన ఇంటర్ విద్యార్థిని రాజేశ్వరికి నిన్న విడుదలైన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 892 మార్కులొచ్చినా ఫెయిలైంది. ఆమెకు సంస్కృతంలో 98, మ్యాథ్స్ 2Aలో 73, 2Bలో 75, ఫిజిక్స్‌లో 60, కెమిస్ట్రీలో 60, 2 ప్రాక్టికల్స్‌లో 60 మార్కులు రాగా.. ఇంగ్లిష్‌లో 5 మార్కులే వచ్చినట్లు మార్కుల లిస్టులో చూపిస్తోంది. కష్టపడి చదివినా ఇంగ్లిషులో 5 మార్కులే రావడం పట్ల విద్యార్థిని కన్నీరుమున్నీరయ్యారు.

error: Content is protected !!