News August 6, 2025

GATE-2026 షెడ్యూల్ విడుదల

image

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు <>gate2026.iitg.ac.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. లేటు ఫీజుతో అక్టోబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో IIT గువహటి ఈ పరీక్షలను నిర్వహించనుంది.

Similar News

News August 6, 2025

మరోసారి CAB అధ్యక్షుడిగా గంగూలీ?

image

BCCI మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉంది. SEP 20న CAB వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుండగా, దాని కంటే ముందే తాను నామినేషన్ దాఖలు చేస్తానని గంగూలీ మీడియాకు వెల్లడించారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గంగూలీ గతంలోనూ CAB అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం CAB ప్రెసిడెంట్‌గా ఆయన సోదరుడు స్నేహాశిష్ ఉన్నారు.

News August 6, 2025

EP28: వీటికి దూరంగా ఉండాలి: చాణక్య నీతి

image

ఉన్నత స్థానం పొందాలన్నా గౌరవంగా బతకాలన్నా 3 విషయాలకు దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ‘ఇతరుల ముందు తమను తాము ప్రశంసించుకోవద్దు. దీని వల్ల సమాజంలో వారిపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకాన్ని కోల్పోతారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు. ఇలా చేస్తే వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. ఎదుటి వారిలో తప్పులు వెతకడం మానుకోవాలి. ఇతరుల్లో తప్పులు వెతికేవారు తమలోని తప్పుల్ని తెలుసుకోలేరు’ అని బోధిస్తోంది.

News August 6, 2025

రాబోయే కొన్ని గంటల్లో వర్షం

image

TG: రాబోయే కొన్ని గంటల పాటు GHMC పరిధిలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 2-3 గంటల్లో మేడ్చల్, గద్వాల్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 కి.మీ కంటే తక్కువ వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. నిన్న కూడా HYDతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.